ఆమె ఇంకా 'సింహా' నే తలుచుకుంటూ....
బాలకృష్ణ సింహా చిత్రంలో నటించిన స్నేహా ఉల్లాల్...తాజాగా సింహా ఈజ్ స్టిల్ రన్నింగ్ స్ట్రాంగ్ అంటూ ట్వీట్ చేసింది. ఇది చదివిన వారు సింహా హండ్రెడ్ డేస్ పంక్షన్ జరుపుకున్నా ఇంకా ఆ కోమా లోంచి బయిటపడలేదా..లేక నేను సింహా లాంటి పెద్ద హిట్ సినిమాలో నటించాను అని గుర్తు చేస్తోందా అంటున్నారు. ఇక సింహా విజయం సాధించినా ఎందుకనో స్నేహా ఉల్లాల్ కి పెద్ద పేరు రాలేదు. ప్లాష్ బ్యాక్ లో కనిపించినా క్రెడిట్ మొత్తం నయనతార కొట్టుకుపోయింది. ఏ కాస్త మిగిలి ఉన్నా నమిత ఆ క్రెడిట్ ని సొంతం చేసుకుంది. దాంతో స్నేహా ఉల్లాల్ పరిస్ధితి అయోమయంలో పడింది. ఇక తెలుగులో ఒక్క సినిమానూ ఆమెకు ఆఫర్ రాలేదు. ఏ పెద్ద హీరో కూడా తమ సినిమాలో నటించమని ఆహ్వానించలేదు. ప్రస్తుతం తమిళం వేదంలో నటిస్తోంది. తెలుగులో దీక్షాసేధ్ చేసిన గొప్పింటి అమ్మాయి పాత్రను ఆమె చేస్తోంది. శింబు..కేబుల్ రాజు పాత్రను చేస్తున్నారు. అతని సరసన చేస్తోంది. ఇక తెలుగులో తీసిన క్రిష్..తమిళంలోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వానమ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ఆర్.బి.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











