'సింహా' నిర్మాత నెక్ట్స్ మరో నందమూరి హీరోతో..

By Srikanya

బాలకృష్ణతో 'సింహా' వంటి సూపర్ హిట్ ఇచ్చిన నిర్మాత పరుచూరి కిరీటి తన తదుపరి చిత్రానికి హీరోగా మరో నందమూరి హీరోని ఎన్నుకున్నారు. అతనెవరో కాదు...కళ్యాణ్ రామ్. ఐతే,అనుకోకుండా ఒకరోజు చిత్రాలతో ఓ సరికొత్త ట్రెండ్ ని ఆవిష్కరించిన యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. యేలేటి ఓ స్క్రిప్టుని వెంకటేష్ కోసం రెడీ చేసారు. కానీ సురేష్ ప్రొడక్షన్ లో లేటవటం, వెంకటేష్ వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉండటంతో యేలేటి మరో స్క్రిప్టుతో ముందుకొచ్చారు. యాక్షన్ ధ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్...తనతో గతంలో అభిమన్యు చిత్రం డైరక్ట్ చేసిన మల్లితో హరేరామ హరే కృష్ణ చిత్రంతో పనిచేస్తున్నారు. శరణ్యామోహన్ హీరోయిన్ గా చేసే ఆ చిత్రం షూటింగ్ చాలా భాగం పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక యేలేటి..ఒక్కడున్నాడు, ప్రయాణం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఈ చిత్రంతోనయినా మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకుంటాడని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X