యువరత్న 'సింహా' షూటింగ్ హైదరాబాద్ లో రీ స్టార్ట్!
యునైటెడ్ మూవీ సమర్పన్ లో బోయపాటి శ్రీను దర్శకత్వం, పరచూరి కిరీటి నిర్మాణంలో రూపుదిద్దుకొంటున్న సినిమా 'సింహా" యువరత్నా బాలకృష్ణ సరసన స్నేహా ఉల్లాల్, నమిత కథానాయికలు గా రూపొందుతున్న విషయం విదితమే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్ల లో చురుకుగా సాగుతోంది.
వరద బాదితుల సహాయనిధిని సేకరించుటకు గాను సినిమా ఇండస్ట్రీ భాద్యతగా 'స్టార్ నైట్ కార్యక్రమం" కి 3 రోజులు సెలవుదినాలుగా ప్రకటించిన విషయం తెలిసినదే. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి మూడు రోజుల విరామం తర్వాత సినిమా ఇండస్ట్రీ యదావిథిగా తమ కార్యక్రమాలను మొదటుపెట్టారు. ఈ సందర్బంగా పరచూరి కిరీటి మాట్లాడుతూ 'సింహా" షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ఇక్కడ పూరైన వెంటనే తర్వాతి షేడ్యూల్ వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నామని తెలియజేశారు. ఇది డిసెంబర్ లో వైజాగ్ లో జరిగే షేడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందని, ఈ చిత్రాన్ని సంక్రాతికి విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు చక్రీ చక్కటి సంగీతాన్నా అందించబోతున్నారు.


Click it and Unblock the Notifications











