»   » బాలకృష్ణ సింహా చిత్రం రిలీజ్ ఎప్పుడంటే....

బాలకృష్ణ సింహా చిత్రం రిలీజ్ ఎప్పుడంటే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణతో బోయపాటి శ్రీను రూపొందిస్తున్న సింహా చిత్రం ఏప్రియల్ రెండో వారంలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం లోని చివరి పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో మార్చి 17 నుంచి షూట్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను గతంలో భద్ర,తులసి వంటి హిట్స్ ఇచ్చి ఉండటంపై ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. చక్రి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత హీరోయిన్స్ గా చేస్తున్నారు. పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu