రామ్ ‘కత్తి’కి సింహా సెంటిమెంట్ కలుసొస్తుందా..
తెలుగు సినిమాలో పరిశ్రమలో సెంటిమెంట్లకు కొదవేం వుండదు..ఓ సినిమా హిట్టయితే ఆ సినిమా సెంటిమెంట్ ని ఫాలో అవడం సర్వసాధారణమే. ఇప్పుడు అదే కోవలో, బాబాయ్ బాలయ్య హీరోగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన 'సింహా" సినిమా సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు హీరో కళ్యాణ్ రామ్. తన తాజా చిత్రం 'కత్తి" ఆడియో విడుదల వేడుక జరపకుండా, ఏకంగా నందమూరి కుటుంబం నుంచి పలువురు హీరోలు హాజరు కానున్నారు.
ఆడియో ఘనవిజయం సాధించిందనీ, సినిమా తప్పక ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందని అంటున్నారడు హీరో, నిర్మాత కళ్యాణ్ రామ్. 'ఎన్టీఆర్ ఆర్ట్స్" పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించిన 'కత్తి" సినిమాలో సనాఖాన్, కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటించిన సంగతి విదితమే. చూద్దాం.. ఈ నెల 12న విడుదల కానున్న 'కత్తి" కి, 'సింహా" సెంటిమెంట్ ఎంతమేర కలిసొస్తుందో..వేచి చూడాల్సిందే..
కళ్యాణ్ రామ్ సనా ఖాన్ కత్తి సింహా బాలకృష్ణ ఎన్టీఆర్ దానయ్య మల్లికార్జున్ మణిశర్మ kalyan ram sana khan katti simha balakrishna ntr danaya mallikarjun mani sharma


Click it and Unblock the Notifications