'సింహం’ లా గాండ్రించనున్న బాలకృష్ణ!
యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మాణంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నిర్మిస్తున్న సింహ సినిమాలో యువరత్న బాలయ్య కొత్త తరహాలో కనబడి గర్జించనున్నాడని పరుచూరి కిరీటి చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది, తర్వాత ఫిబ్రవరి 20 నుండి మార్చి 10 ఫారిన్ కంట్రీస్ లో 3 సాంగ్స్ షూటింగ్ తో పూర్తి అవుతుందని. వేసవిలో సినిమా విడుదలకు చేయుటకు ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు. ఇప్పటి వరకు బాలయ్య సినిమాల్లో కనబడని కొత్త కోణం ఇందులో కనబడుతుందని ఇందులో చక్రి ఇచ్చిన మ్యూజిక్ అత్యద్భుతం అని కిరీటి పేర్కొన్నారు.
అయితే ఇప్పటికి చాలా సార్లు ఇలా చెప్పిన బాలయ్య సినిమాలు సోదిలో లేకుండాపోవటంతో ఇప్పుడు ఈ సినిమా కూడా ఇదే బాటలో ఉండి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా కిరీటి మాత్రం మంచి స్ర్కిప్ట్ కుదిరిందని చెబుతున్నారు. ఇక నయనతార చేసిన పాత్ర ఆమె తప్ప ఇంక ఎవ్వరూ చేయలేరన్న విధంగా ఉందని, స్నేహా ఉల్లాల్, నమిత పాత్రలు కూడా అద్బుతంగా ఉన్నాయని సినిమా సమ్మర్ రిలీజ్ కి సిధ్దం అయ్యేలా ప్లాన్ చేస్తున్నాం అని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. మొత్తం మీద బాలయ్య సింహాలో కొత్తగా కనబడతాడని చెప్పటంతో బాలకృష్ణ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











