బాలకృష్ణ కోసం సింహాచలం సెట్

ఈ చిత్రంలో ప్రస్తుత రాజకీయాలపై విమర్శలు కూడా ఉన్నాయంటూ ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే 'లెజెండ్' పేరు పరిశీలనలో ఉంది. బాలకృష్ణని 'సింహా'గా చూపించారు బోయపాటి శ్రీను. అప్పటి వరకు పెద్ద పెద్ద సంభాషణలతో తనదైన శైలిలో కనిపించిన బాలకృష్ణని కొత్తగా చూపించి అభిమానులతో శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి బాలకృష్ణని నాయకుడు తరహా పాత్రలో చూపించబోతున్నారు.
'సింహ' కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. జగపతిబాబు ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ తొలిసారి బాలకృష్ణ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్ లెజెండ్ ఫస్ట్‌లుక్‌ను రీసెంట్ గా విడుదల చేసింది. దానికి మంచి క్రేజ్ వచ్చింది.
మరో ప్రక్క బాలకృష్ణ మరోసారి 14రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ కి సినిమా చెయ్యబోతున్నారని సమాచారం. ప్రస్తుతం 'లెజెండ్' చిత్రం నిర్మిస్తున్న 14రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ మరోసారి బాలకృష్ణ తో ఎగ్రిమెంట్ అయ్యారని చెప్తున్నారు. బాలకృష్ణకు సైతం వారి నిర్మాణ విలువలు, నిజాయితితో వ్యవహరించే తీరు నచ్చి మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ డైరక్ట్ చేయనున్నారు. ఈ మేరకు టాక్స్ జరిగాయని,స్క్రిప్టు వర్క్ కూడా ప్రారంభమయ్యిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.


Click it and Unblock the Notifications











