'ఇంద్ర','తమ్ముడు' పోలికలోనే ...'నాయక్' కూడా
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం ఇంద్ర.. అలాగే పవన్ కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం తమ్ముడు. ఇప్పుుడు రామ్ చరణ్ తాజా చిత్రం నాయక్ దిగుతోంది. అదే తరహాలో సంచలన విజయం సాధించాలనో మరేమో కాని ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ ని ఈ రెండు చిత్రాల తరహాలో పెట్టారు.
'ఇంద్ర', ట్యాగ్ లైన్ : BORN FOR THE PEOPLE
'తమ్ముడు'కు ట్యాగ్ లైన్ : BORN TO WIN
'నాయక్' కి ట్యాగ్ లైన్ :THE LEADER
ఈ ట్యాగ్ లైన్ మెగాభిమానులను ఆనందపరుస్తోంది.
నిన్నే విడుదలైన ఈ చిత్రం ఆడియో అభిమానులను అలరిస్తోంది. 2012 బెస్ట్ ఆడియో గా నిలుస్తుందంటున్నారు.
చిత్రం గురించి వివి వినాయిక్ మాట్లాడుతూ... నిత్యం నెత్తురు మండే యువకులే ఈ దేశానికి అవసరం... అన్నారు శ్రీశ్రీ. ఆ కుర్రాడు కూడా అచ్చం అలాగే ఉంటాడు. సరదాలూ, విలాసాలూ, వినోదాలూ అంటూ కాలాన్ని ఖాళీ చేయడం అతనికి ఇష్టం ఉండదు. లక్ష్యం తప్ప అతని కంటికి మరో వస్తువు కనిపించదు. తన ఒక్కడి కోసం కాదు.. తనని నమ్ముకొన్న అందరి కోసం ఓ పోరాటానికి సిద్ధమయ్యాడు. అదేమిటి? అందులో అతను విజయం సాధించాడా? లేదా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు .
రామ్ చరణ్ సరసన కాజల్, అమలా పాల్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రధాన తారాగణంపై న్యాయస్థానానికి సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరించారు. 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్నా' అనే గీతాన్ని రీమిక్స్ చేశారు. రామ్‌చరణ్, అమలాపాల్‌లపై ఈ గీతాన్ని తెరకెక్కించారు. తమన్ సంగీతం అందించారు. జనవరి 9న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.


Click it and Unblock the Notifications











