ఆ హీరోకి తల్లిగా సిమ్రాన్...లవర్ గా త్రిష
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్య నటించిన 'ఘర్షణ', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' ప్రేక్షకుల్ని మెప్పించాయి. మరోసారి వీరిద్దరు జనాల్ని అలరించనున్నారు. వారి కలయికలో మూడో చిత్రం తెరకెక్కనుంది. 'ధ్రువనక్షత్రం' అనే పేరు పెట్టారు. 'ఫొటోన్ కథాస్' సంస్థ సమర్పణలో గౌతమ్ మీననే నిర్మించనున్నాడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంపిక జరుగుతోంది.
'ధ్రువనక్షత్రం' టైటిల్ తో గతంలో వెంకటేష్ హీరోగా ఓ చిత్రం తెలుగులో వచ్చింది. 1989 లో ఆ చిత్రం వచ్చింది. మాఫియా నేపధ్యంలో ఆ చిత్రం రూపొందింది. ఇక ఈ కొత్త చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉండటం, గౌతమ్ మీనన్ చిత్రాలకు సైతం తెలుగులో బిజినెస్ ఉండటం కలిసి వచ్చే అంశం.
నాగచైతన్యతో... ' ఏమి మాయ చేసావే ' చిత్రంతో తెలుగువారికి పరిచయమైన దర్శకుడు స్టార్ డైరక్టర్ గౌతమ్ మీనన్. ఆ తర్వాత ఆయన తమిళంలో చేసిన చిత్రాలుకు ఇక్కడ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఆయన మరో చిత్రం కమిటయ్యారుయ. గతంలో 'కాక్క కాక్క'(తెలుగు ఘర్షణ) తో సూర్య కి ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చిపెట్టిన ఆయన మరోసారి సూర్యతో చిత్రం చేయటానికి సిద్దమవుతున్నారు.


Click it and Unblock the Notifications












