తెలుగు తెరపై సిమ్రాన్ మరోసారి...డిటేల్స్
హైదరాబాద్ : సిమ్రాన్ గుర్తుందా.... ఒకప్పుడు తెలుగు,తమిళ భాషల్లో నెంబర్ వన్ స్ధాయికి వెళ్ళిన సిమ్రాన్ పెళ్ళయ్యాక వేషాలు కరువయ్యాయి. పెళ్లి అనంతరం తమిళంలో ఓ చిత్రం, తెలుగులో 'జాన్ అప్పారావు-40 ప్లస్' అనే సినిమా చేసింది. తమిళంలో చేసిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ మంచి ఫలితాన్నే ఇచ్చినా ఆఫర్స్ తెచ్చి పెట్టలేకపోయింది. అయితే ఇప్పుడు మరోసారి తెలుగులోకి వస్తోంది. నాని తాజా చిత్రం ఆహా కళ్యాణంలో ఆమె కీ రోల్ చేస్తోంది. అయితే పాత్ర ఏమిటన్నది మాత్రం తెలియరాలేదు. ఈ చిత్రం పిభ్రవరిలో విడుదల కానుంది.
బాలీవుడ్ సినిమా 'బ్యాండ్ బాజా బారాత్'కు అధికారిక రీమేక్ అయిన 'ఆహా కల్యాణం'లో నాని హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది తమిళ, తెలుగు భాషల్లో తయారవుతోంది. ఒరిజినల్‌ను నిర్మించిన ప్రతిష్ఠాత్మక బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న తొలి దక్షిణాది చిత్రమిది. గోకుల్‌కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వాణీ కపూర్ హీరోయిన్. ఈ రీమేక్ లో నటించడానికి యష్ రాజ్ ఫిల్మ్స్ రూ. 2.5 కోట్లు ఆఫర్ చేసిందనే వార్త ఆ మధ్యన టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
నాని మాట్లాడుతూ... "యశ్‌రాజ్ ఫిలిమ్స్ (వై.ఆర్.ఎఫ్.) తొలి సౌత్ ఇండియన్ మూవీలో హీరోనైనందుకు గర్వంగా ఉంది. ముంబైలో వారి స్టూడియోని సందర్శించడం మరచిపోలేని అనుభూతి. అది పెద్ద ఎగ్జిబిషన్‌ను చూసినట్లే అనిపించింది. వై.ఆర్.ఎఫ్. అధినేత ఆదిత్య చోప్రాతో మూడు గంటల సేపు మాట్లాడే అవకాశం లభించింది. మా సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించి ఆయన మాట్లాడుతుంటే ఆ సంస్థ ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందన్నది అర్థమైంది.ఇప్పటికే ఫ్రీమేక్‌గా రూపొందిన తెలుగు సినిమా ('జబర్‌దస్త్')ని నేను చూడలేదు. " అన్నారు.
ఇక సిమ్రాన్ వివాహం చేసుకుని సెటిలయ్యాక ఆమెను ఇప్పుడు తల్లి పాత్రలు చేయమంటూ నిర్మాతలు,దర్శకులు వస్తున్నారు. వాటిని సిమ్రాన్ చాలా కోపంగా తిప్పికొడుతోంది. నిన్న మొన్నేగా నేను నిజ జీవితంలో తల్లి అయ్యింది.. అప్పుడే స్క్రిన్ పై పెద్ద హీరోలకు తల్లిగా చేయమంటారా అని అంత ఎత్తున కోపంతో ఎగిరిపడుతోంది. తను ఇప్పుడు నదియా, కుష్భుల దారిలో స్మాల్ స్క్రీన్ కి వచ్చి గేమ్ షో చేసుకుంటున్నానని, హ్యాపీగా ఉన్నానని అంది. ముఖ్యంగా తనతో చేసిన హీరోలకే తల్లిగా అడుగుతున్నారని, అది తనకు చాలా అవమానంగా ఉందని భాధపడింది. ఇక ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో నెంబర్ వన్ స్ధాయికి వెళ్ళిన సిమ్రాన్ పెళ్ళయ్యాక వేషాలు కరువయ్యాయి.


Click it and Unblock the Notifications












