సెకెండ్ ఇన్నింగ్స్ ఫ్రారంభించి ఫెయిలయిన సిమ్రాన్ ఇప్పుడు ఓ కొత్త ఆలోచన వచ్చిందిట. తనలో ఉన్న సృజనాత్మకతను బయటపెట్టాలని. దానికోసం దర్శకురాలుగా మారాలని. అందులోనూ మహిళాదర్శకులకు ప్రత్యేక డిమాండు ఉందని ఎంక్వైరీ చేసి తెల్సుకుందిట.రేవతి ని ప్రేరణగా తీసుకోవాలని డిసైడ్ చేసుకుందిట.ఆలోచన అధ్బుతం ముందు డైరక్షన్ నేర్చుకుంటే ...నిర్మాతలకు కొదవేముంటుంది అని దగ్గర వాళ్ళు వెన్ను తట్టి ప్రోత్సహించారుట. దాంతో ఆమె తన రేంజికి తగ్గ దర్శకుడు ఎవరా అని ఆలోచిస్తే మణిరత్నం ఆమె దృష్టిలో కి వచ్చారుట. దాంతో ఆయన లేటెస్ట్ గా చేస్తున్న సినిమాకి అసెస్టెంట్ గా చేరటానికి ప్రిపేర్ అవుతోందిట.ఇది విన్న కోలివుడ్ జనం సిమ్రాన్ కి ఈ కొత్త పిచ్చి పట్టిందేమిటీ...రేపు నిర్మాతలు కావాలంటూ పోటికి వస్తుంది...డేట్స్ కావాలంటూ పరిచయమున్న హీరోలను ఇబ్బందిపెడుతుంది ఎలా ...అని ఆలోచనలోపడుతున్నారుట.