టిక్కెట్లు అమ్మే స్థాయి నుంచి హీరోయిన్‌గా ఎదిగా
సాధారణంగా సినిమా రంగంలో ఎలాంటి సపోర్టు లేకుండా హీరోగానో, హీరోయిన్ గానే రాణించడం కాస్త కష్టమే. ఉన్నా చాలా తక్కువే. ఆ కోవలోకే వస్తుంది బాలీవుడ్ నటి సిమ్రాన్ కౌర్ ముండి. ఈవిడ ఒకప్పుడు సినిమా టిక్కెట్లు అమ్మే జాబ్ చేసి...ఇప్పుడు హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
తాజను నటించిన 'జో హమ్ చాహె' చిత్రం ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన సిమ్రామ్ కౌర్ ముండి బంజారా హిల్స్ లోని ఓ హోటల్ లో మీడియాతో మాట్లాడారు. గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ గా ముఖ్యమైన అతిథితులకు సినిమా టిక్కెట్లు అందించే ఉద్యోగం చేసిన తాను హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. 2008 మిస్ ఇండియా యూనివర్స్ పోటీలకు ఎంపిక కావడంతో తన జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగిందన్నారు.
పవన్ గిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్ కౌర్ ముండి సన్నీ గిల్ అనే నటుడితో జతకట్టింది. అమన్ గిల్ ఈ చిత్రానికి నిర్మాత కాగా, సచిన్ గుప్తా సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











