మహేష్ పై మనస్సు పడ్డ ‘పోటుగాడు’ హీరోయిన్

By Srikanya

హైదరాబాద్ : బాలీవుడ్ భామలందరి దృష్టీ మహేష్ బాబు మీదే పడింది. బ్రేక్ కోసమో లేక అంతటి అందగాడి సరసన నటించాలనో కానీ...తమకు మహేష్ తో అవకాసం కావాలంటూ ఇంటర్వూలలో చెప్తున్నారు. తాజాగా మనోజ్ సరసన పోటుగాడు చిత్రంలో చేసిన సిమ్రాన్ కౌర్ గా లీడింగ్ ఇంగ్లీష్ డైలీ తో మాట్లాడుతూ ఇదే విషయం వెల్లడించింది.

సిమ్రాన్ కౌర్ మాట్లాడుతూ "నాకు మహేష్ తో నటించాలంటే చాలా ఇష్టం. ఆయన చాలా క్యూట్ గా ఉంటారు. నేను నమ్రతను కలిసి ఆయనతో పనిచేయాలనే ఆసక్తిని వెల్లడించాను " అంటూ చెప్పుకొచ్చింది. టాలీవుడ్ చాలా బాగుందని ఇక్కడ సెటిల్ అవ్వాలనే కోరిక ఉన్నట్లు తెలిపింది. సిమ్రాన్ 2008లో ఫెమీన మిస్ ఇండియా పీజెంట్ అవార్డును సొంతం చేసుకుంది.

ఇక ... నా డ్రీం టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుతో సినిమా చేయాలన్నది నా కోరిక. అతని లూక్స్ చాలా బాగుంటాయని' తన మనసులో మాటని బయటకి చెప్పేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ మాట్లాడుతూ ఇలా స్పందించింది. గత కొన్ని రోజులుగా మహేష్ బాబు సరసన సోనమ్ కపూర్ నటిస్తోందని వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో ఈ మాటలకు ప్రాధాన్యత ఏర్పడింది. తాజాగా సోనమ్ కూడా తన మసులోని మాట చెప్పడం వల్ల తన కోరిక కూడా త్వరలోనే నిజమవుతుందని ఆశిద్దాం

సోనమ్ కపూర్ రీసెంట్ గా 'రంఝానా', 'భాగ్ మిల్కా భాగ్' సినిమాలతో సూపర్ హిట్స్ సాథించి ఉషారుగా ఉంది. తాజాగా హైదరాబాద్ లో ఓ ప్రమోషనల్ ఈవెంట్ కి హాజరైన ఈ భామ తనకి టాలీవుడ్ లో పనిచేయాలని ఉందని, తను 'రంఝాన' లో చేసిన లాంటి పూర్తి ప్రాముఖ్యత ఉన్న పాత్రలు వస్తే చేస్తానని తెలిపింది. తనకి తెలుగు పరిశ్రమలో నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయి కానీ తనకి మన భాష రాకపోవడం వల్లే ఇక్కడి సినిమాలు ఒప్పుకోవడం లేదని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X