వేషం కోసం దిగజారిన సిమ్రాన్
ఒకప్పుడు స్టార్ గా వెలిగిన సిమ్రాన్ వేషాలు కోసం మరీ అంతగా దిగజారాలా అని కామెంట్ చేయించుకుని చేసిన చిత్రం ఒకటి తెలుగులో డబ్బింగ్ అయివస్తోంది. సాధారణంగా కెరీర్ చివరిదశంలో వేషాలు లేక తమ కున్న కొద్ది పాటి క్రేజ్ నీ అమ్ముకునే ప్రయత్నంగా ఇలాంటి సాఫ్ట్ పోర్న్ చిత్రాల్లో నటిస్తూంటారు. అలాంటిదే తమిళంలో రూపొందిన 'కిచా వయస్సు 16" చిత్రం. దానిని తెలుగులోకి అనువాదం చేసి 'నా వయసు 16" పేరిట తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వారం క్రితం కిరణ్ రాధోడ్ ప్రధాన పాత్రలో మెలీనా ఇటలీ చిత్రం ఆధారంగా ఇలాంటి సినిమా ఒకటి ప్రారంభం కావటంతో ఆ ప్రేరణతో ఈ చిత్రాన్ని తెలుగులో దించుతున్నట్లు సమాచారం.
ఈ సందర్బంగా నిర్మాత ఎం.శ్రీధరన్ మాట్లాడుతూ ఆకాష్ ప్రత్యేకపాత్రలో నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానుంది. "ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్ధి తన టీచర్ ను ప్రేమించడం ఈ చిత్రంలోని ప్రధానాంశం. విద్యార్ధిగా మణికంఠ, టీచర్‌గా సిమ్రాన్ నటించారు. అనిత మరో పాత్ర పోషించింది.యువతను కవ్వించే రొమాంటిక్ సన్నివేశాలతో ఈ చిత్రం రూపొందింది. ప్రతి పాటా భారీగా చిత్రీకరించాం" అన్నారు.గతంలో భానుప్రియ ప్రధాన పాత్రలోనూ ఇలాంటి కాన్సెప్ట్ తో టీచర్ ఐలవ్ యు అనే చిత్రం ఒకటి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











