నా మొగుడే హీరో

అదేంటి అని అర్ధంకాక అడిగిన వారికి భూమిక వాళ్ళాయిన్ని నటింపచేయటం లేదా అలాగే నేను కూడా మా ఆయన దీపక్ ని హీరోగా పెట్టి సినిమా చేసి హిట్టు కొడతాను అంది. అంతేగాక ఓ స్క్రిప్టుకూడా రెడీ అయిందని చెప్పుకొచ్చింది. ఆ కథలో ఇద్దరు హీరోలుంటారట. అందులో ఒకరు ఆమె భర్త దీపక్. రెండో హీరో జనాల్ని ధియోటర్ కి లాక్కువచ్చే భాద్యత వహిస్తాడని అంటోంది. మరి మీ ఆయన ఏం చేస్తాడు అంటే కొత్త కదా నటించి రిజల్ట్ కోసం ఎదురు చూస్తాడని చెప్తోంది. ప్రస్తుంతం ఆమె అరడజను దాకా సీరియల్స్ చేస్తోంది.త్వరలోనే ప్రారంభం కానున్న ఆమె ప్రొడక్షన్ హిట్టు అవ్వాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











