twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా మొగుడే హీరో

    By Staff
    |

    Simran
    సీనియర్ నటి సిమ్రాన్ ఇప్పుడో సినిమా నిర్మించాలని,పెద్ద నిర్మాతగా ఎదగాలని ఉబలాటపడుతోంది.నిన్నటి దాకా మణిరత్నం దగ్గర అసెస్టెంట్ గా జాయినయి డైరక్షన్ టెక్నిక్ లు పట్టేస్తానని తిరిగిన ఆమెకు అవన్నీ అనవసరం..ఉన్న డబ్బుతో..మంచి కథతో సినిమా తీస్తే బెటర్ అనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఆమె సినిమాలో హీరో ఎవరని అందరికీ డౌట్ వచ్చింది. దానికి ఆమే సమాధానం ఇస్తూ..నా మొగుడే హీరో అంది సింపుల్ గా.

    అదేంటి అని అర్ధంకాక అడిగిన వారికి భూమిక వాళ్ళాయిన్ని నటింపచేయటం లేదా అలాగే నేను కూడా మా ఆయన దీపక్ ని హీరోగా పెట్టి సినిమా చేసి హిట్టు కొడతాను అంది. అంతేగాక ఓ స్క్రిప్టుకూడా రెడీ అయిందని చెప్పుకొచ్చింది. ఆ కథలో ఇద్దరు హీరోలుంటారట. అందులో ఒకరు ఆమె భర్త దీపక్. రెండో హీరో జనాల్ని ధియోటర్ కి లాక్కువచ్చే భాద్యత వహిస్తాడని అంటోంది. మరి మీ ఆయన ఏం చేస్తాడు అంటే కొత్త కదా నటించి రిజల్ట్ కోసం ఎదురు చూస్తాడని చెప్తోంది. ప్రస్తుంతం ఆమె అరడజను దాకా సీరియల్స్ చేస్తోంది.త్వరలోనే ప్రారంభం కానున్న ఆమె ప్రొడక్షన్ హిట్టు అవ్వాలని కోరుకుందాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X