ఇక ఆ... పాత్రలు ‘సై’ అంటున్న సిమ్రన్
అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని సెటిలైన సిమ్రన్....ఆ మధ్య ఓ సినిమాతో హీరోయిన్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చినా ఫలితం లేక పోయింది. దీంతో వెండితెరపై తన కెరీర్ గ్రాఫ్ మరింత పెంచుకునేందుకు రూటు మార్చింది. ఇకపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడానికి రెడీ అని...తల్లి, అక్క, వదిన లాంటి పాత్రలు చేయడానికి సిద్ధమే అంటోంది.
ఒకప్పుడు తెలుగు, తమిళంలో బాగా పాపులర్ అయిన సిమ్రాన్.....ఇప్పుడు ఆయా రంగంలకు దర్శకులు, నిర్మాతలకు తాను ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్దమే అని సంకేతాలు పంపుతోంది. సిమ్రాన్ ఆ మధ్య సూర్య హీరోగా వచ్చిన చిత్రంలో అతనికి తల్లిగా నటించింది.
ఆ సినిమాలో సిమ్రాన్ తల్లి పాత్రకు మంచి రెస్పాన్ వచ్చిన నేపథ్యంలో....ఇకపై తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమెకు ఆ తరహా పాత్రల్లో అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యంగ్ హీరోలకు ఆమె తల్లిగా, అక్కగా బాగా సూటవుతుందనేది సినీవిశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం ఆమె సూర్య హీరోగా రూపొందుతున్న ధృవ నచ్చితిరం సినిమాలో సూర్యకు తల్లిగా నటిస్తోంది.


Click it and Unblock the Notifications












