సిమ్రాన్ సంక్రాంతి ఆశలు
తెలుగు, తమిళ చిత్ర రంగంలో ఒకప్పుడు సిమ్రాన్ నంబర్ వన్ గా కొనసాగింది. ఇపుడు పరిస్థితి తారుమారైంది. ఒక అవకాశం దొరికితే చాలు అనే పరిస్థితి ఇపుడు సిమ్రాన్ ది. పెళ్లై తల్లైన తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన సిమ్రాన్ కు బాలకృష్ణ సరసన ఒక్క మగాడు సినిమాలో అవకాశం దొరికింది. రెండో చిత్రంగా జాన్ అప్పారావ్ 40 ప్లస్ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత ఆమెకు అవకాశాలు రావట్లేదు. ఈ రెండు చిత్రాలపైనే ఆమె తన ఆశలను పెట్టుకుంది. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికే విడుదల అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలు విజయవంతమై తన కెరీర్ కచ్చితంగా ఊపందుకుంటుందనే ఆశాభావంతో సిమ్రాన్ ఉంది. సంక్రాంతి పండుగ సిమ్రాన్ కు అవకాశాల వెల్లువ తెచ్చిపెట్టాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











