సుభద్రగా సింధు మీనన్ ఈ సారైనా..
త్వరలో సుభద్రగా సింధూ మీనన్ కనిపించనుంది. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ఆమె సరసన ఓ కొత్త కుర్రాడు నటించనున్నాడు. ఇక సింధు మీనన్ కు ఇది ధర్డ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. భద్రాచలం చిత్రంతో పాపులర్ అయిన సిందు ఆ తర్వాత శ్రీరామ చంద్రలు వంటి చిత్రాల్లో నటించినా కలిసిరాలేదు. ఆ తర్వాత చాలా కాలానికి కృష్ణవంశీ చందమామ చిత్రంతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది.దాంతో ఆమె సెకెండ్ ఇన్నింగ్స్ మొదలయ్యాయి అన్నారు. అయితే ఆ చిత్రం ద్వారా ఆమెకు కొత్తగా వచ్చిన లక్ ఏమీ లేవు. ఇక మళ్లీ గ్యాప్ తో ఈ కొత్త చిత్రానికి కమిట్ అయ్యింది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం అంటున్నారు కాబట్టి ఈ చిత్రంతో అయినా ఆమెకు కలిసి వస్తుందని ఆశిద్దాం.
సింధు మీనన్ సుభద్ర కృష్ణవంశీ చందమామ శివ బాలాజీ సిద్దం జగపతి బాబు భద్రాచలం sindu menon subhadra krishna vamsi bhadrachalam jagapati babu siddam


Click it and Unblock the Notifications