గొంతు విప్పనున్న సింధూతులాని ...

అలాఇదివరకు సుహాసిని, సౌందర్య తమ పాత్రలకు తామే డబ్బింగ్ చేప్పుకోవాలని ప్రయత్నించి సఫలమయ్యారు. ఇప్పుడు గ్లామర్ తార ఛార్మి సైతం స్వల్ప కాలంలోనే తెలుగు నేర్చుకుని, తనే డబ్బింగ్ చెప్పుకుంటోంది. తాజాగా ఆ లిస్టులో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్న తార సింధూ తులాని. ఇదివరకు తమ్మారెడ్డి భరద్వాజ సినిమా 'పోతే పోనీ'లో చక్కని నటన ప్రదర్శించి, విమర్శకుల మెప్పు పొందిన ఆమె ఇప్పుడు 'బతుకమ్మ' పాత్రతో తెలంగాణ ప్రేక్షకులకు బాగా సన్నిహితమైంది. ఆ పాత్రలో ఆమె నటనకు అందరూ జేజేలు పలుకుతున్నారు.
దాంతో తెలుగు నేర్చుకుని, తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకుంది సింధు. రానున్న సినిమాల్లో తన గొంతే వినిపిస్తుందని ఆమె చెబుతోంది. అయితే త్వరలో విడుదల కానున్న 'బ్లాక్ అండ్ వైట్'లో మాత్రం ఆమె గొంతు వినిపించింది. ఆ తర్వాత వచ్చే సినిమాల్లో మాత్రం ఆమె గొంతును మనం వినవచ్చు. ఇలా కొద్దిమందైనా మన తెలుగు భాష పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తుండటం సంతోషాన్ని కలిగించే విషయం.


Click it and Unblock the Notifications











