ఒక్కో సినిమా ఒక్కోక్కరికి భలే కలిసివస్తుంది. ఆ మథ్య 'చందమామ' లో చేసిన కాజల్ అలాగే ఎదిగిపోయింది. వరస సినిమా ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరవుతోంది. కాని అందులో చేసిన మరో హీరోయిన్ సింధు మీనన్ కెరీర్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళిలా అన్నట్లుగా కదలిక లేకుండా ఉండి పోయింది. నిజానికిచందమామలో మంచి ఈజీనెస్ చూపింది మాత్రం సింథునే. కాని బేడ్ టైం. అప్పడెప్పుడో 'శ్రీరామ చంద్రులు' తరువాత ఆమె గురించి చెప్పుకునే వాళ్ళే కరువయ్యారు. అదృష్టం బాగుండి కృష్ణ వంశి సినిమా ఆఫర్ వస్తే ఇక దస తిరుగుతుందని ఆస పడింది. కాని క్రెడిట్ మొత్తం కాజల్ కొట్టుకుపోయింది.దాంతో అర్ధం కాని స్ధితిలో పడింది. ఈలోగా వి.యన్.ఆదిత్య 'రొయిన్ బొ' లో సెలక్టయి చేస్తోంది. కాని దాంట్లోను ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. దాంతో సినిమా వర్కవుట్ అయినా సింథుకు ఎంత వరకు కలిసి వస్తుందనే సందేహంలో ఉందిట.