ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చట
భద్రాచలం సినిమాతో తెరంగేట్రం చేసిన సింధు మీనన్ ఆ చిత్రం ఆశించిన పేరు తేలేకపోయింది. అయితే ఇటీవల నటించిన చందమామ సినిమా ఆమెకు చక్కని పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆమె నటనతో పాటు ఎక్స్ పోజింగ్ కు కూడా వెనకాడలేదు. ఇందుకు చందమామ సినిమా దర్శకుడు కృష్ణవంశీ కృషి ఎంతో ఉంది. చందమామ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న సింధు మీనన్ అదే బాటలో పయనించాలని నిర్ణయించుకుంది. అందుకే ఆమె ఎక్స్ పోజింగ్ కు రెడీ అంటోంది. తను చేసే పాత్రను హైలెట్ చేసే ప్రయత్నంలో దర్శకుడు ఏవిధంగానైనా తనను ఉపయోగించుకోవచ్చని, స్క్ర్రిప్ట్ డిమాండ్ మేరకు ఎంతైనా ఎక్స్ పోజింగ్ చేస్తానని అంటోంది. లేట్ ఎవరిదో తెలుస్తోందిగా.


Click it and Unblock the Notifications











