పాప్ స్టార్ మైఖెల్ జాక్సన్

By Staff

మైఖేల్‌ జయంతి సందర్భంగా ఆయన జీవితాన్ని ఒకసారి స్మరించుకొందాం. మైఖేల్‌ జాక్సన్‌ ఆపేరు వింటేనే పాప్‌ ప్రపంచం పులకించిపోతుంది. మైఖేల్‌ జాక్సన్‌ జీవించింది. యాభై ఏళ్ళే అయినా ఆయన లైఫ్‌లో ఏది పాడినా సంచలనమే. పాప్‌ సంగీతంలో పెను సంచలనం మైఖేల్‌ జాక్సన్‌. ఆయన పాట విని ప్రపంచ సంగీతాభిమానులు ఊగిపోయారు. ఆయన చేసే ప్రతీ స్టెప్పూ అద్భుతమే ప్రతీ విన్యాసమూ వివాదమే పాప్‌స్టార్‌గా ఎదగడం దగ్గరనుంచి పెళ్ళి, పిల్లలు, ఆఖరికి చావు కూడా జాక్సన్‌ జీవితంలో సంచలనాలే.

పేదరికం, తండ్రి పెట్టే కఠినమైన ఆంక్షలు...మనసు చంపుకుని జీవనం సాగించిన చిన్ననాటి ఘటనలు ఆయన మనసులో బలంగా నాటుకుపోయాయి. అయినా తన రాకింగ్‌ ఫర్ఫామెన్స్‌తో మ్యూజిక్‌ లవర్స్‌ను పిచ్చెక్కించిన మైఖెల్‌ అనతి కాలంలోనే సంగీత ప్రపంచంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. ఎల్‌విజ్‌ ప్రెస్లీ కూతురైన...లిస్సా మేరి ప్రెస్లీని జాక్సన్‌ వివాహమాడిన కొద్దికాలానికే విడాకులిచ్చాడు. 1996లో డెబ్బీరోవేని రెండో పెళ్ళి చేసుకున్నాడు. మూడేళ్ళు గడవక ముందే ఆమెతో కూడా తెగతెంపులు చేసుకున్నాడు. అప్పటికే ఇద్దరు పిల్లలున్న మైఖేల్‌ మూడవ బిడ్డకు తండ్రయినప్పుడు పెద్ద దుమారం రేగింది. నల్లజాతి మైకెల్‌ జాక్సన్‌ తెలుపు రంగు స్కిన్‌ కోసం అనేక సర్జరీలు చేయించున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్‌ స్కిన్‌ సర్జరీలు చేయించుకున్న వ్యక్తిగా కూడా మైఖేల్‌ రికార్డు సాధించారు. చనిపోయే ముందు జాక్సన్‌ ఇస్లాం మతం స్వీకరించాడు. సంచలనాల మైఖేల్‌ చావు కూడా వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

మైకెల్ జయంతి సందర్భంగా టెన్సిల్ టౌన్ లో యంగ్ టాలెంటెడ్ సింగర్స్ అంతా కలిసి ఆయన కీర్తిని స్మరించుకొంటూ 'కింగ్ ఆఫ్ ద పోప్" మరో సారి పాడండంటూ బెన్ని, మరియు ధరణ్ పాటకు లిరిక్స్ ను అందించారు, ఈ పాటను పది మంది సింగర్స్ తో బృందగానాన్ని పాడి వినిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X