సూర్య ‘సింగం’ సెన్సార్ రిపోర్ట్
హైదరాబాద్ : సూర్య, అనుష్క, హన్సిక ప్రధాన తారాగణంగా తమిళంలో రూపొందుతున్న 'సింగం-2' చిత్రం తెలుగులో 'సింగం' పేరుతో జులై 5వ తేదీన విడుదలకు సిద్దం అవుతోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. రీజనల్ సెన్సార్ బోర్డు ఈచిత్రానికి ఎలాంటి కత్తిరింపులు లేకుండా క్లీన్ 'U' సర్టిఫికెట్ జారీ చేసింది.
చిత్ర నిర్మాతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 2,400 స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో విడుదలైన 'సింగం'(తెలగులో యముడు) భారీ విజయం సాధించిన నేపథ్యంలో 'సింగం-2'(ఇప్పడు తెలుగులో సింగం) చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈచిత్రంలో సూర్య యంగ్ అండ్ డైనమిక్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో హాలీవుడ్ నటుడు డానీ సపాని నటిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాలైన Oxford Murders మరియు Trance చిత్రాల్లో డానీ సపాని నటించారు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేంది. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై నూతన నిర్మాత ఎస్.లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: వి.టి.విజయన్, మాటలు: శశాంక్ వెనె్నలకంటి, కెమెరా: ప్రియన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: ఎస్.లక్ష్మణ్‌కుమార్, దర్శకత్వం: హరి.


Click it and Unblock the Notifications











