'సింగం' (యముడు సీక్వెల్) విడుదల తేదీ ఖరారు
తమిళంలో కమర్షియల్ దర్శకుడిగా హవా చాటుకుంటున్న హరి. స్టార్ హీరో సూర్యతో 'సింగం' (తెలుగులో యముడు) తెరకెక్కించి అద్భుత విజయాన్ని అందించాడు. ఆ చిత్రానికి కొనసాగింపుగా 'సింగం-2' (తెలుగులో సింగం) సిద్ధం చేస్తున్నాడు. తొలి భాగంలో అనుష్క హీరోయిన్ . రెండోభాగంలో ఆమెతోపాటు హన్సిక కూడా చేరింది. ఇటీవల విడుదలైన టీజర్ అన్నివర్గాలను ఆకట్టుకుంటోంది.
ఇక ఈ చిత్రంలో కథేమిటంటే..... 'సింగం'(యముడు) లో ప్రకాశ్‌రాజ్ మృతిచెందిన తర్వాత సూర్య తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని చెప్పి తూత్తుకుడి వెళ్లిపోతాడు. అక్కడ అండర్‌కవర్ ఆపరేషన్ ఆఫీసరుగా మారుతాడు. తూత్తుకుడి సముద్రమార్గం ద్వారా ఆయుధాల సరఫరాను అడ్డుకునేందుకు ప్రయత్నించడమే కథ. దక్షిణ భారతదేశంలో ప్రారంభమయ్యే కథ దక్షిణాఫ్రికాలో ముగుస్తుంది.
చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... నిజానికి 'సింగం-2' ఇంటర్వెల్ నుంచి ప్రారంభయ్యే కథలా ఉంటుంది. కొత్త విషయాలతో తీర్చిదిద్దుతున్నాం. 'దురైసింగం'(సూర్య పాత్రపేరు) చేసే హంగామా, ఛేజింగ్ కొత్తగా, ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. రెండోభాగంలో హన్సికను కూడా జతచేర్చాం. సూర్య ఇంట్రడక్షన్ సాంగ్ లో అంజలి తళుక్కున మెరుస్తుంది. సూర్య తూత్తుకుడి పోలీసుగా ఉన్నా ఇండియన్ పోలీసుగా సత్తా చాటుతాడు. పోలీసులపై గౌరవాన్ని తీసుకురావడం మాత్రమేకాక యువకుల్లో పోలీసు కావాలనే తపన కూడా పుడుతుంది అన్నారు.
ఇక రెండోభాగంలో చేరిన తారాగణంలో హన్సిక పాత్ర ప్రధానమైనది. సంతానం కూడా చేరాడు. వివేక్ పాత్ర ఇందులోనూ కొనసాగుతుంది. తొలిసారిగా హాలీవుడ్ నటుడు టానీ సపాని విలన్ గా పరిచయం అవుతున్నాడు. త్వరలో తెరపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు.
హరి దర్శకత్వంలోప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై నూతన నిర్మాత ఎస్.లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: వి.టి.విజయన్, మాటలు: శశాంక్ వెనె్నలకంటి, కెమెరా: ప్రియన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: ఎస్.లక్ష్మణ్‌కుమార్, దర్శకత్వం: హరి.


Click it and Unblock the Notifications












