ఒకే బాటలో పయనిస్తున్న మహేష్ - పవన్ ??
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..'ఇద్దరూ ఇద్దరే"నని హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. యస్.జె.సూర్య దర్వకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొమరం పులి, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రం రెండూ సుధీర్ఘంగా నిర్మాణం జరుపుకుంటుండడమే ఇందుకు కారణం.
పవన్ కళ్యాణ్ నటించిన 'జల్సా" విడుదలైన రెండు సంవత్సరాలు పూర్తి కావస్తుండగా, మహేష్ బాబు నటించిన 'అతిధి" విడుదలై మూడోయేడు నడుస్తోంది. ఇక 'ఇద్దరికీ ఒక్కరే" అంటే ఏమిటంటే, వీళ్లిద్దరి చిత్రాలకు నిర్మాత ఒక్కరే కావడం. కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ ఈ రెండు చాత్రాల్ని నిర్మిస్తున్నారు. ఒక్కో చిత్రం ముప్పై కోట్ల పై చిలుకు భారీ బడ్జట్ తో రూపొందుతున్న ఈ రెండు చిత్రాలు గత రెండేళ్లుగా జరుపుకుంటుండడం తెలిసిందే!
More from Filmibeat
మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కొమరం పులి కిలాడి అతిధి జల్సా త్రివిక్రమ్ శ్రీనివాస్ mahesh babu pawan kalyan komaram puli kiladi athidhi jalsa trivikram sreenivas singanamala


Click it and Unblock the Notifications











