కోట్లు కుమ్మరించినా 'పులి' లొంగట్లేదు..
నోట్లు నోళ్ళు వెళ్ళబెట్టిన నిజమిది..కోట్లు ఖంగుతిన్న వాస్తవమిది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సంచలనం 'కొమరం పులి" పై ఎంతటి భారీ అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఆ అంచనాలకు తగ్గట్టే పంపిణీదారులు ఫ్యాన్సీ ఆఫర్స్ తో వస్తున్నప్పటికీ ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ద్వారా ఓన్ గానే రిలీజ్ చెయ్యాలనుకుంటోన్న నిర్మాత శింగనమల రమేష్ మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోవట్లేదు.'ఖలేజా" రైట్స్ ని కోటీ తొంబై లక్షలకు తీసుకున్న పశ్చిమగోదావరి జిల్లాలో 'పులి" పంపిణీ హక్కుల కోసం రెండు కోట్ల నలబై లక్షల భారీ మొత్తం ఇవ్వజూపినా అమ్మకానికి తిరస్కరించిన శింగనమల నమ్మకం ఇండస్ట్రీలో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
అలాగే అన్ని ఏరియాస్ నుండి ఇదే రీతిలో కనీవినీ ఎరుగని రేట్స్ ని కోట్ చేస్తున్నా కోట్లకు లొంగనంటోన్న 'కొమరం పులి" రేపు రిలీజయ్యాక నిర్మాత నమ్మకాన్ని ఎంత వరకూ నిలబెడుతుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications