బెయిల్ పై విడుదలైన సింగనమల
మద్దెలచెర్వు సూరిని హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న భానుకిరణ్‌తో కలిసి బెదిరింపులకు పాల్పడిన కేసులో నిర్మాత సింగ నమల రమేష్‌కు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు శనివారం ఆయన చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి రమేష్‌నేరుగా ఇంటికి వెళ్లి పోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు.
షాలిమార్ వీడియోస్ యజమానికి రమేష్ దాదాపు 70 లక్షల వరకు బకాయి పడ్డాడు. అయితే ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా భాను సహాయంతో బెదిరింపులకు పాల్పడుతూ వచ్చాడు. భాను అండ ఉన్నంత సేపు రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడిన బాధితులు, సూరి హత్య తర్వాత భాను అజ్ఞాతంలోకి వెల్లి పోవడంతో ధైర్యం తెచ్చుకున్నారు.
రమేష్ వల్ల బెదిరింపులకు గురైన షాలిమార్ వీడియోస్ యజమానులతో పాటు, వైజయంతి మూవీస్ యజమానులు పోలీసులకు పిర్యాదు చేశారు. తప్పించుకు తిరుగుతున్న రమేష్ ను పథకం ప్రకారం ట్రాప్ చేసి పట్టుకున్నారు. బెదిరింపుల కేసులో తప్ప సూరి హత్య కేసులో రమేష్ హస్తం లేదని సీఐడీ విచారణలో తేలింది.


Click it and Unblock the Notifications











