మహేష్ బాబు కోసమే పుట్టినట్లుగా ఉంటుంది..
ఆయన కోసమే పుట్టినట్టుగా ఉంటుంది ఇందులో ఆయన పాత్ర. యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకుంటాయి అంటున్నారు నిర్మాత శింగనమల రమేష్. మహేష్ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే...మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయిక అంటే అంచనాలు ఏమేరకు ఉంటాయో తెలుసు. వాటిని తప్పకుండా అందుకుంటాం. మహేష్ తప్ప మరెవ్వరూ చేయని విధంగా అతని పాత్రని త్రివిక్రమ్ మలిచారు. మహేష్ కెరీర్‌లోనే 'ఖలేజా' గొప్ప సినిమాగా నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలం. హై బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందుతోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పొటెన్షియాలిటీని తెలిపే చిత్రమిది. మణిశర్మ అందించిన పాటలు త్వరలోనే విడుదల చేస్తాం. ఈనెల 18 నుంచి మిగిలిన రెండు గీతాల్ని తెరకెక్కించి సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మహేష్..క్యాబ్ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











