'కొమరం పులి' ఆడియోకి స్పందన ఎలా ఉందంటే...
"కొమరం పులి ఆడియోకి వస్తున్న స్పందనకు ఎంతో ఆనందంగా వుంది. సాధారణంగా పవన్ సినిమా అనగానే మ్యూజికల్‌గా మంచి రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇక పవన్‌కు రెహమాన్ లాంటి గొప్ప సంగీత దర్శకుడు తోడవ్వడంతో ఆ ఆల్బమ్ కు క్రేజ్ ఎక్కువైంది. తప్పకుండా ఆడియో తరహాలోనే చిత్రం కూడా రికార్డుల వర్షం సృష్టిస్తుందనే నమ్మకం వుంది' అని నిర్మాత శింగనమల రమేష్ మీడియాకు తెలిపారు. ఆయన నిర్మిస్తున్న కొమరం పులి చిత్రం ఆడియో రీసెంట్ గా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల సీడీలు అమ్ముడయ్యాయని సమాచారం.
దాంతో ఆయన తన ఆనందంగా ఈ విషయాన్ని తెలియచేస్తూ...పైరసీ భూతం ఉన్నా భారీగా సీడీలు అమ్ముడుపోయాయి. అలాగే డౌన్ లోడ్స్ కూడా ఎక్కువగానే జరిగాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.ఇక సోనీ మ్యూజిక్ ద్వారా కొమరం పులి పాటలు విడుదలయ్యాయి. నికీషా పటేల్ హీరోయిన్ పరిచయమవుతోంది. ఖుషి ఫేమ్ ఎస్.జె.సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరాయి.


Click it and Unblock the Notifications











