యానిమేషన్‌ లో మాయాబజార్‌

By Staff

సింగీతం గారి గురించి చెప్పాలంటే.. ఒక్క మాట సరిపోతుంది. తెలుగు సినిమా పుట్టినప్పుడు పుట్టిన వారాయన. సెప్టెంబర్‌ 1931లో తెలుగు సినిమా పుట్టగా సింగీతం జన్మదినం సెప్టెంబర్‌ 21, 1931. ఇటీవలే ఆయన 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా హైదరాబాద్‌లో ఘనసన్మానం నిర్వహించారు.

గట్టిగా మూడు, నాలుగు సినిమాలు చేసేసరికి ఐడియాలు తట్టక చతికిలబడిపోతున్న నేటి దర్శకుల పరిస్థితి చూస్తే సింగీతం ఎంత ఘనాపాటో అర్థం అవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మళయాల, ఇంగ్లీష్‌ చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో పురస్కారాలను అందుకున్న ఘనులు సింగీతం శ్రీనివాసరావు.

ఆయన చేసిన ప్రతి చిత్రమూ ఒక ప్రయోగమే. పాతికేళ్ల కిందటే రావు.. గోపాలరావు అనే చిత్రంలో పరకాయ ప్రవేశం గురించి రీసెర్చ్‌ చేసే ఒక ప్రొఫెసర్‌, అతడి స్టూడెంట్ల కథలను ఎంతో సున్నితమైన హాస్యంతో, హృద్యమైన సందేశంతో తెరకెక్కించారు సింగీతం.

ఒక పక్క అందరూ డైలాగుల మోత మోగిస్తూ సినిమాలు చేసేస్తుంటే అసలు మాటలే లేని ఒక చిత్రాన్ని రూపొందించి ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకున్న ప్రతిభాశాలి సింగీతం. అదే కమల్‌హాసన్‌ నటించిన పుష్పక విమానం. అదే కమల్‌ని మరుగుజ్జుగా చూపిస్తూ ఆయన దర్శకత్వం వహించిన విచిత్ర సోదరులు అన్ని భాషల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో కూడా తెలుసు. కేవలం ప్రయోగాలే కాదు.. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన మయూరి వంటి చక్కని సందేశాత్మక చిత్రాన్ని కూడా అద్భుతంగా మలిచారు సింగీతం.

రెండేళ్ల కిందట ఆయన అల్లావుద్దీన్‌ - మ్యాజిక్‌ ల్యాంప్‌ యానిమేషన్‌ చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం అమెరికా తదితర దేశాలలో ప్రదర్శనలకు నోచుకుంది. అదే స్ఫూర్తితో సింగీతం శ్రీనివాసరావు ప్రస్తుతం పాత మాయాబజార్‌ చిత్రాన్ని యానిమేషన్‌ చిత్రంగా రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. దర్శకుడు కె.వి.రెడ్డి శిష్యులైన సింగీతం - మాయాబజార్‌ - చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

మాయాబజార్‌ వంటి గొప్ప చిత్రం యానిమేషన్‌ ద్వారా మళ్లీ తెర మీదకు వస్తే - కేవలం తెలుగు వారే కాక యావత్‌ ప్రపంచ ప్రేక్షకులు దాన్ని చూసి ఆనందించే అవకాశం కలుగుతుంది. అంతటి గొప్ప పనిని సింగీతం తప్ప మరెవ్వరు చేయగలరు! హ్యాట్సాఫ్‌ టు సింగీతం!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X