For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సింగీతం శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం

  By Srikanya
  |

  హైదరాబాద్ :గోవాలో ఈ నెల 20 నుంచి అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. వీటిలో పాల్గొనాల్సిందిగా ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు.

  ''ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సినీరంగ ప్రముఖులతో ఓ చర్చా కార్యక్రమం ఉంటుంది. ఒక్కో సెషన్‌లో ఒక్కో దర్శకుడు విదేశీ ప్రముఖులతో ముచ్చటిస్తారు. దీని కోసం కొంతమంది భారతీయ దర్శకుల్ని ఎంపిక చేశారు. అందులో నేనూ ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఈ జాబితాలో శ్యామ్‌ బెనగల్‌, మధుర్‌ బండార్కర్‌ తదితర దర్శకులూ ఉన్నారు. నేను ఈ నెల 25న చర్చాగోష్ఠిలో పాల్గొంటా ను''అని చెప్పారు.

  అలాగే ఈ చిత్రోత్సవాల్లో తాను దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'అపూర్వ సహోదరర్గళ్‌'ని ఈ నెల 24న ప్రదర్శించనున్నట్లు సింగీతం తెలిపారు. నవంబర్‌ 20వ తేదీ నుంచి కేరళ ఫిలిం ఫెడరేషన్‌ సంస్థతో కలిసి ఆల్‌ లైట్స్‌ ఫిల్మ్‌ సొసైటీ కేరళలోని గోవాలో పది రోజులపాటు 46వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ను భారీగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

  Singeetam Srinivasa Rao guest to Goa Festival

  ఈ ఫిల్మోత్సవ్‌లో దాదాపు 34 దేశాల నుండి 131 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. కేరళ రాష్ట్రంలోని 18 ప్రధాన పట్టణాలలో ఈ సినిమాలను ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాన్ని ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ ప్రారంభించనున్నారు. దక్షిణాసియాలోని అత్యంత పెద్ద ఫిలిం మార్కెట్‌గా పిలువబడే ఇండీవుడ్‌ ఫిలిం మార్కెట్‌ సంస్థ ఈ ఉత్సవానికి ప్రాయోజకులుగా వ్యవహరిస్తున్నారు.

  'ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులతోపాటు సినిమా ప్రేమికులు భారీ సంఖ్యలో ఈ ఫిల్మోత్సవ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ వేడుకల్లో భాగంగా యాభైఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రముఖ మలయాళ దర్శకుడు ఆదూరి గోపాలకృష్ణన్‌ను ఘనంగా సత్కరించబోతున్నాం. అలాగే ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత యష్‌చోప్రాకు ఈ ఉత్సవంలో ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈ ఫిల్మోత్సవ్‌లో 'గోల్డెన్‌ ఫ్రేం' అవార్డు కోసం 50 చిత్రాలు పోటీ పడుతున్నాయి.

  వీటితోపాటు తొలిసారి తీసిన సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలకు కూడా పోటీ ఉంటుంది. ఇరానియన్‌ దర్శకుడు ఖోశ్రో మాసౌమి నేతృత్య వహిస్తున్న జ్యూరీ ఈ సినిమాలను సమీక్షిస్తుంది. ప్రపంచంలో అత్యంత పెద్ద ఫిలిం మార్కెట్‌గా భారత్‌ను నిలపాలనే లక్ష్యం దిశగా ఈ ఉత్సవాలను నిర్వహించడం గొప్ప విషయం. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ఫిల్మోత్సవ్‌ను నిర్వహించేందుకు కేరళ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాల్ని అందిస్తోంది' అని సంస్థాపక డైరెక్టర్‌ సోహాన్‌రారు తెలిపారు. 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆదూరి గోపాల్‌కృష్ణన్‌కు ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఘన సన్మానం ఉన్నాయి.

  సింగీతం శ్రీనివాసరావు విషయానికి వస్తే... '2003లో 'సన్నాఫ్ అల్లాడిన్' అనే యానిమేటెడ్ మూవీతో దేశవిదేశాల్లోనూ అలరించారు... ఆ పైన 'వరుడు', 'చిన్నిచిన్ని ఆశ' చిత్రాల్లో నటుడిగానూ కనిపించిన సింగీతం రాబోయే క్రిష్ 'కంచె' సినిమాలోనూ ప్రాధాన్యమున్న పాత్రను పోషించారు.. ప్రస్తుతం 'ప్రిన్స్ ఆఫ్ పీస్' అనే సినిమా రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు.

  English summary
  Singeetam Srinivasa Rao guest for Goa film festival 2015.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X