అల్లు అర్జున్ తో సింగీతం ...
ఆదిత్యా 369, పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మైఖేల్ మదన కామరాజు వంటి చిత్రాలతో పేరుతెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన తాజాగా అల్లు అర్జున్ చిత్రంలో ఫుల్ లెంగ్త్ పాత్రను చేయనున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో రెడీ అవుతున్న చిత్రం ఈ విశేషం చోటుచేసుకోనుంది. దాదాపు 79 సంవత్సరాల వయస్సు ఉన్న సింగీతం ఇప్పటికీ ఘటోత్కచ వంటి యానిమేషన్ చిత్రాలను రూపొందింస్తూ యువ దర్శకులకు పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక అంతకుముందు కూడా సింగీతం కొన్ని చిత్రాల్లో గెస్ట్ పాత్రలు చేసారు. కానీ పూర్తి స్దాయి పాత్రను చేయటం మాత్రం ఇదే మొదటసారి. ఐదు రోజుల పాటు జరిగే వివాహం నేపద్యంలో జరిగే ఈ చిత్రం భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతోందని సమాచారం.
singeetham srinivas rao allu arjun aditya 369 michel madan kama raju gunashekar ఘటోత్కచ సింగీతం శ్రీనివాసరావు ఆదిత్యా 369 పుష్పక విమానం విచిత్ర సోదరులు


Click it and Unblock the Notifications