వెల్ కం టు 'మాస్టర్ ఆఫ్ మేజిక్'

ఆయనే వైవిద్యమైన వినోదాత్మక చిత్రాల రూప శిల్పి సింగితం శ్రీనివాసరావు గారు. వెంటనే ప్రపోజల్ ఆయన ముందు పెట్టటం ఆయన ఆనందంగా ప్రాజెక్టులోకి దూకేయటం జరిగింది. యుద్ద ప్రాతిపదికపై ఘటోత్కచుడు ప్రాణం పోసుకున్నాడు . పిల్లలును అలరించటానికి తన బాల్యాన్ని, అల్లరిని గుర్తు చేసుకున్నాడు. అంతేగాక మాయాబజార్ లోని 'వివాహభోజనంబు' పాటను మళ్ళీ ఎత్తుకుని మజా చేస్తున్నాడు. ఆడియో వచ్చే వారం టి.సిరీస్ ద్వారా మార్కెట్లో ప్రత్యక్షమవుతుందిట. ఇక ఈ హీరో యేడు భాషల్లో దేశం లోని పిల్లలందరికి అర్ధమయ్యేలా మాట్లాడతాడట. అందరికి నచ్చి ఇష్టపడే లా ఈ మెగాప్రాజెక్టుని తీర్చి దిద్దింది సూర్యదేవర వినోద్. ఇక ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కొ ఆర్డినేటర్ వి.బి.చౌదరి వహిస్తున్నారు. కథ,కథనం,దర్శకత్వం సింగితం శ్రీనివాసరావు గారు వహిస్తున్నారు. ఈ నెల 23 న థియోటర్లల్లోకి వచ్చి పిల్లలతో ఆడి పాడటానికి తన మంత్ర తంత్రాలు నేర్పటానికి ఘటోత్కచుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్లీజ్ వెల్ కం టు మాస్టర్ ఆఫ్ మేజిక్.


Click it and Unblock the Notifications











