పవన్ తో ‘జీసెస్‌క్రైస్ట్’గురించి సింగీతం క్లారిటీ
హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌తో ఆ మధ్యన 'జీసెస్‌క్రైస్ట్' అనే చిత్రం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో మొదలై ఆగిపోయింది. ఈ విషయమై ఆయన ఈ రోజు ఓ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో క్లారిఫై ఇచ్చారు. సింగీతం గారు...తను కేవలం ప్రెస్ మీట్ మాత్రమే పెట్టానని చెప్పారు.
సింగీతం గారు మాట్లాడుతూ... ఆ సినిమా షూటింగే ఇంకా మొదలుపెట్టలేదు. జెరుసలేంలో ప్రెస్‌మీట్ పెట్టాం అంతే. కానీ తొలి షెడ్యూల్ అయిపోయింది, రెండో షెడ్యూల్ అయిపోయింది అని వార్తలొచ్చాయి. వాటి గురించి నాకైతే తెలీదు అన్నారు. అయితే కేవలం చిత్రం లో పవన్ ది కెస్ట్ రోల్ అని చెప్పారు.
సింగీతం మాట్లాడుతూ.... అవును... జీసస్ కథే. చాలా గొప్ప కథ. అందులో పవన్‌ది అతిథి పాత్ర. ఆ సినిమా కోసం జీసస్‌కి చెందిన ఎన్నో పుస్తకాలు చదివాను. చివరకు బైబిల్ తెప్పించుకొని చదివా. అప్పుడు తెలిసింది ఆయన కథలోని గొప్పతనం. ఈ సినిమా పుణ్యమా అంటూ క్రీస్తు పుట్టిన బెత్లహాంకు వెళ్లాము. ప్రశాంతత అంటే ఏంటో అక్కడ తెలిసింది నాకు అన్నారు.
pawan kalyan konda krishnam raju singeetham srinivas పవన్ కళ్యాణ్ కొండా కృష్ణంరాజు సింగీతం శ్రీనివాసరావు


Click it and Unblock the Notifications
