సింగీతం శ్రీనివాసరావు నెక్ట్స్ చిత్రం ఖరారు..డిటేల్స్
ఈ చిత్రం తర్వాత ఆయన పూర్తి స్ధాయి మ్యూజికల్ చిత్రం చేయనున్నాట్లు తెలిపారు. పూర్తిగా పాటలతో చిత్రం ఉంటుందని,డైలాగులు ఉండవని, అలాగని పుష్పక విమానం చిత్రానికి దానికి సంభందం లేదని తెలిపారు.
ఇత సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శాండల్‌వుడ్ పతాకంపై నిర్మాత ఎస్. భారతీకృష్ణ నిర్మిస్తున్న 'వెల్‌కమ్ ఒబామా' చిత్రం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ అన్ని కమర్షియల్ హంగులతో కొత్త నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణ పూర్తయిందని, ఈ నెలలో ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
ఇప్పటికే జరిగిన రెండు షెడ్యూల్స్‌లో టాకీ మొత్తం పూర్తయింది కనుక డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, మే మూడో వారంలో ఆడియోను విడుదల చేస్తామని నిర్మాత ఎస్.భారతీకృష్ణ తెలిపారు. రేచల్, ఊర్మిళ, సంజీవ్, నిరంజని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.ఎస్.దర్శన్, రచన, సహకారం: రోహిణి, ఆర్ట్: వర్మ, నిర్మాత: ఎస్.్భరతీకృష్ణ, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు.


Click it and Unblock the Notifications












