twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సింగీతం శ్రీనివాసరావు నెక్ట్స్ చిత్రం ఖరారు..డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : అపూర్వ సహోదరులు, ఆదిత్య 369, పుష్పక విమానం, భైరవద్వీపం వంటి విలక్షణ చిత్రాలను అందించిన సీనియర్‌ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు. ఆయన దర్శకత్వంలో ప్రస్తుతం 'వెల్‌కమ్ ఒబామా' చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రం తర్వాత మరో చిత్రానికి అప్పుడే ఆయన ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.

    ఈ చిత్రం తర్వాత ఆయన పూర్తి స్ధాయి మ్యూజికల్ చిత్రం చేయనున్నాట్లు తెలిపారు. పూర్తిగా పాటలతో చిత్రం ఉంటుందని,డైలాగులు ఉండవని, అలాగని పుష్పక విమానం చిత్రానికి దానికి సంభందం లేదని తెలిపారు.

    ఇత సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శాండల్‌వుడ్ పతాకంపై నిర్మాత ఎస్. భారతీకృష్ణ నిర్మిస్తున్న 'వెల్‌కమ్ ఒబామా' చిత్రం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ అన్ని కమర్షియల్ హంగులతో కొత్త నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణ పూర్తయిందని, ఈ నెలలో ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

    ఇప్పటికే జరిగిన రెండు షెడ్యూల్స్‌లో టాకీ మొత్తం పూర్తయింది కనుక డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, మే మూడో వారంలో ఆడియోను విడుదల చేస్తామని నిర్మాత ఎస్.భారతీకృష్ణ తెలిపారు. రేచల్, ఊర్మిళ, సంజీవ్, నిరంజని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.ఎస్.దర్శన్, రచన, సహకారం: రోహిణి, ఆర్ట్: వర్మ, నిర్మాత: ఎస్.్భరతీకృష్ణ, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు.

    English summary
    Singeetham Srinivasa Rao is planning to direct his next feature film. He revealed that his next film will have an interesting cast and that it’ll be a musical film. “It’ll be a total musical film and as different as Pushpaka Vimanam,” he said. More details are expected to be revealed soon.
 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X