కొత్త నటీనటులకు సింగితం శ్రీనివాస్ రావు పిలుపు

By Bojja Kumar

హైదరాబాద్ : వైవిధ్య భరితమైన చిత్రాలకు చిరునామా సింగీతం శ్రీనివాసరావు. పుస్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం...ఇలా పలు ప్రమోగాత్మకమైన చిత్రాలను వెండితెరకు అందించిన ఘనత ఆయనది. కథాపరంగా మాత్రమే కాకుండా సాంకేతికంగా కూడా ఆయన చిత్రాలు ఉన్నత స్తాయిలోనే ఉంటాయి.

నాలుగు దశాబ్దాల కెరీర్‌లో పలు విజయవంతమైన చిత్రాలు అందించిన సింగీతం తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శాండిల్ వుడ్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని ఎస్.భారతీకృష్ణ, భారతి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా నూతన తారలను పరిచయం చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో ఈ చిత్రాన్ని ఆరంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్నవారు తమ ఫోటోగ్రాఫ్, ప్రొఫైల్ ని [email protected]కి పంపవచ్చు. వివరాల కోసం 09032426116 నెంబర్‌కి కాల్ చేయండి.

ఆ విషయం పక్కన పెడితే...
సింగితం శ్రీనివాసరావు గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు. బాలయ్య త్వరలో సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు, సింగితం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన తన గత సినిమా 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్‌గా ఆ సినిమా రూపొందబోతోందని, దానికి'ఆదిత్య 999' అనే టైటిల్ పెట్టారని, ఇందులో ఇషా చావ్లాను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు ఈ వార్తలపై క్లారిటీ రాలేదు. సింగితం దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ జీసస్ పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరిగినా...అది కూడా ఆచరణకు నోచుకోలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X