twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేప్ కేసు : స్టార్ సింగర్‌కు బెయిల్ మంజూరు

    By Bojja Kumar
    |

    న్యూఢిల్లీ: గర్ల్‌ఫ్రెండ్‌పై అత్యాచారం చేసిన ఆరోపణలు ఎదుర్కుంటున్న నేపథ్య గాయకుడు అంకిత్ తివారీకి మే 26వ తేదీన వరకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆషిఖీ 2 గాయకుడు అంకిత్ తివారీ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

    అంకిత్ తివారీకి ముంబైలోని స్థానిక సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 15 వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తును సమర్పించారు. శుక్రవారం సాయంత్రం జైలు నుంచి అంకిత్ తివారీ విడుదలైనట్లు ఆయన తరపు న్యాయవాది నీరజ్ గుప్తా వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదుపై అత్యాచారం కేసులో మే 8 తేదిన అంకిత్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసి మే 12 తేది వరకు పోలీస్ కస్టడీ విధించారు. ఆతర్వాత అంకిత్ కు మే 26 తేది వరకు జుడిషియల్ కస్టడీ విధించారు.

    Singer Ankit Tiwari held for rape gets bail

    ఈ కేసులో అంకిత్ తివారీ సోదరుడు కూడా అరెస్టయ్యాడు. ఆషికీ-2 చిత్రంలోని 'సున్ రహా హై తూ' అనే పాటతో సంగీత అభిమానుల ఆదరణను పొందాడు. గర్ల్ ఫ్రెండ్ చేసిన ఆరోపణలను అంకిత్ తివారీ తోసిపుచ్చారు. డబ్బులు లాగే ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని ఆయన అంటున్నారు. ఇంతకాలం బాధితురాలు ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నిస్తున్నారు.

    English summary
    A sessions court on Thursday granted bail to playback singer Ankit Tiwari who was arrested on rape charges.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X