Don't Miss!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రేప్ కేసు : స్టార్ సింగర్‌కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: గర్ల్‌ఫ్రెండ్‌పై అత్యాచారం చేసిన ఆరోపణలు ఎదుర్కుంటున్న నేపథ్య గాయకుడు అంకిత్ తివారీకి మే 26వ తేదీన వరకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆషిఖీ 2 గాయకుడు అంకిత్ తివారీ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
అంకిత్ తివారీకి ముంబైలోని స్థానిక సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 15 వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తును సమర్పించారు. శుక్రవారం సాయంత్రం జైలు నుంచి అంకిత్ తివారీ విడుదలైనట్లు ఆయన తరపు న్యాయవాది నీరజ్ గుప్తా వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదుపై అత్యాచారం కేసులో మే 8 తేదిన అంకిత్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసి మే 12 తేది వరకు పోలీస్ కస్టడీ విధించారు. ఆతర్వాత అంకిత్ కు మే 26 తేది వరకు జుడిషియల్ కస్టడీ విధించారు.
ఈ కేసులో అంకిత్ తివారీ సోదరుడు కూడా అరెస్టయ్యాడు. ఆషికీ-2 చిత్రంలోని 'సున్ రహా హై తూ' అనే పాటతో సంగీత అభిమానుల ఆదరణను పొందాడు. గర్ల్ ఫ్రెండ్ చేసిన ఆరోపణలను అంకిత్ తివారీ తోసిపుచ్చారు. డబ్బులు లాగే ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని ఆయన అంటున్నారు. ఇంతకాలం బాధితురాలు ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నిస్తున్నారు.