ఫన్ బకెట్ భార్గవ్ గురించి ముందే తెలుసు.. ఆ అమ్మాయి కూడా ఎప్పుడో చెప్పింది: చిన్మయి షాకింగ్ కామెంట్స్

ఫన్ బకెట్ భార్గవ్ ఇటీవల ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన అందరిని షాక్ కు గురి చేసింది. స్మార్ట్ గా తెలివిగా మాయమాటలు చెప్పి మైనర్ బాలికలను లోబర్చుకోవడం అలవాటుగా చేసుకునే సన్నాసులు ఇంకా చాలా మంది ఉన్నారని సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు బయట ప్రపంచానికి తెలియకపోవడం వలన ఎవరు అంతగా పట్టించుకోవడం లేదని సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్మయి

ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్మయి

సింగర్ చిన్మయి కేవలం గాయనిగానే కాకుండా సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలపై కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. గతంలో ప్రముఖ దర్శకులపై రచయితలపై కూడా చిన్మయి మీటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఫన్ బకెట్ భార్గవ్ కేసుపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి

ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఫన్ బకెట్ భార్గవ్ అఘాయిత్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలో చాలా మంది అమ్మాయిలు అతని భారిన పడి మోసపోయినట్లు తెలుస్తోంది. ఎక్కువగా టీనేజ్ అమ్మాయిలనే అతను టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక 14ఏళ్ళ బాలికను లోబరచుకొని గర్భవతిని చేయడంతో అతని అసలు రంగు బయటకు వచ్చింది.

అలాంటి వార్తలు రావడంతో..

అలాంటి వార్తలు రావడంతో..

ఇక ఆ విషయంపై స్పందించిన సింగర్ చిన్మయి ఇలాంటి విషయంలో అబ్బాయిలకంటే అమ్మాయిలదే తప్పు అన్నట్లుగా న్యూస్ క్రియేట్ చేయడం బాధాకరమని అన్నారు. ఇటీవల ఒక న్యూస్ పేపర్ లో 'అతి గారభం పేరెంట్స్ నిర్లక్ష్యం వలన అమ్మాయిలకు పూర్తి స్వేచ్ఛ దొరకడంతో సోషల్ మీడియా ద్వారా ఇలాంటి దారుణాలు జరుగుతున్నట్లు' ఒక కథనం వచ్చింది. అయితే దానిపై చిన్నయి ఆవేదన వ్యక్తం చేశారు.

అలా చూపించడం కరెక్ట్ కాదు

అలా చూపించడం కరెక్ట్ కాదు

అత్యాచారం జరిగినప్పుడు అమ్మాయిని బాద్యురాలిగా చూపించడం కరెక్ట్ కాదు. ఫన్ భార్గవ్ లాంటి సన్నాసి కామాంధులు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో భార్గవ్ చాలా మందికి తెలియడం వల్లే అతని అఘాయిత్యాలు బయటకొస్తున్నాయని అన్నారు.

Recommended Video

Actor Vivek Biography, తన ధ్యేయం ఇదే , రూమర్స్ నమ్మొద్దు | RIP Vivek Sir | Filmibeat Telugu
భార్గవ్ గురించి నేను ముందే గమనించాను

భార్గవ్ గురించి నేను ముందే గమనించాను

ఇక భార్గవ్ గురించి ఇది వరకే కొన్ని ఆరోపణలు రావడం నేను గమనించాను. అతను స్త్రీ లోలుడు అని తెలిసింది. అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ కూడా అతని చేడు బుద్ధి గురించి ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్మార్ట్ గా కన్నింగ్ గా మాటలు కలిపి మోసం చేస్తారు. అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావడం తప్పేమీ కాదు. కానీ ఎవరితో స్నేహం చేస్తున్నాము అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. అని చిన్మయి వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X