పెళ్లి సంతలో పశువుల బేరంలా... నాకు అలాంటి అనుభవమే: సింగర్ చిన్మయి

By Bojja Kumar

Recommended Video

Singer Chinmayi Speech @ChiLaSow Movie

సుశాంత్‌, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం 'చిలసౌ'. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్‌ 3న 'చిలసౌ' విడుదలవుతుంది. సినిమా ప్రమోషన్లలో దర్శకుడి భార్య, ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పిన సింగర్ చిన్మయి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమ్మాయిలు సంతలో పశువులా

అమ్మాయిలు సంతలో పశువులా

మ్యారేజ్ మార్కెట్‌లో అమ్మాయిలు ఉన్నపుడు పశువులను బేరం ఆడినట్లు బేరం ఆడతారు. ఒక ఆవును కొన్నపుడు దాని వల్ల ఎలాంటి లాభాలు వస్తాయో అని ఆలోచించినట్లే... ఈ ఇంట్లో నుండి అమ్మాయి వస్తే.... ఆమెతో పాటు ప్రాపర్టీ వస్తుందా? డౌరీ వస్తుందా? ఎక్ట్స్‌ట్రా కానుకలు ఏముంటాయి? ఇలాంటి డీలింగ్సే మాట్లాడుకుంటారు. అబ్బాయికి, అమ్మాయికి నచ్చింది అనుకుంటే అపుడు ఇవన్నీ మాట్లాడటం మొదలు పెడతారు.

నాకూ అలాంటి అనుభవమే..

నాకూ అలాంటి అనుభవమే..

నేను కూడా మా అమ్మ ఒత్తిడి వల్ల ఈ అరేంజ్డ్ మ్యారేజ్ సెట్టింగ్‌లోకి వెళ్లాను. అపుడు ఓ అబ్బాయి మీ మదర్ స్పిరిచువల్ లైఫ్ మీద మీ రెస్పాన్సిబిలిటీ ఏమిటని అడిగాడు. దానికి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇలా రకరకాల తిక్క ప్రశ్నలు అడుగుతారు. కొంత మంది ఒక సాంగు పాడటానికి మీ సాలరీ ఎంత? ఇంత వరకు ఎంత సంపాదించారు? ప్రాపర్టీ ఎంత ఉంది అని అడిగేవారు. ఇవన్నీ చూశాక అసలు పెళ్లి చేసుకోవద్దనే పరిస్థితికి వచ్చేశాను.

పాపం రాహుల్ దొరికాడు, పెళ్లి చేసుకున్నా

పాపం రాహుల్ దొరికాడు, పెళ్లి చేసుకున్నా

ఇలాంటి అనుభవాలన్నీ ఎదురైన తర్వాత పాపం రాహుల్ దొరికాడు. అతడిని పెళ్లి చేసుకున్నాను. ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి, అతని వ్యక్తిత్వం నచ్చింది, ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం అని చిన్మయి తెలిపారు.

చిలసౌ కథ నచ్చింది

చిలసౌ కథ నచ్చింది

ఈ సినిమాకు రాహుల్ రాసుకున్న కథ నాకు బాగా నచ్చింది. ఇందులో హీరోయిన్ అడుగుతుంది మేమేమైనా వాషింగ్ మెషీన్సా... ఫీచర్స్ చూసి కొనడానికి అని, ఇపుడు అబ్బాయిలకు కూడా అలాంటి పరిస్థితే ఉంది. మా సాలరీ చూసి పెళ్లి చేసుకుంటున్నారు అని వారంటారు. మీరు ఒక వైపే ఫెమినిస్ట్ ఆలోచనలు చేయవద్దు అని చెప్పే విధానం నచ్చింది.

నాకు బాగా కనెక్ట్ అయిన స్టోరీ

నాకు బాగా కనెక్ట్ అయిన స్టోరీ

ఈ స్టోరీలో ఒక బామ్మ, మదర్, ఆమె ఇద్దరు కూతుర్లు ఉంటారు. నాకు ఈ స్టోరీ బాగా కనెక్ట్ అయింది. మా అమ్మ కూడా సింగిల్ పేరెంట్. కొన్ని సన్నివేశాలు నాకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పేటపుడు ఎన్నో విషయాలు నాకు టచ్ అయ్యాయి అని చిన్మయి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X