Chinmayi: వర్జినిటీపై సింగర్ చిన్మయి బోల్డ్ కామెంట్స్.. పెళ్లి చేసుకోవాలనుకుంటే అలా చేయండంటూ!

ప్రముఖ టాలీవుడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు చిన్మయి శ్రీపాద. సమంత వంటి స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే పలు అంశాలపై స్పందిస్తూ విమర్శల పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. క్యాస్టింగ్ కౌచ్ నుంచి అమ్మాయిలపై చూసే అభిప్రాయం వరకు తనదైన స్టైల్ లో సమాధానాలు ఇస్తుంటారు. పలు సామాజిక విషయాల పట్ల ఆమె అభిప్రాయాన్ని ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడుతుంటారు. ఆమెపై వచ్చే కామెంట్స్, ట్రోలింగ్ కు కూడా అంతే ధీటుగా రిప్లై ఇస్తుంటారు. తాజాగా ఆమె వర్జినిటీపై బోల్డ్ కామెంట్స్ చేశారు.

 అనేక పాటలు పాడి..

అనేక పాటలు పాడి..

బ్యూటిఫుల్ సింగర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద భారతీయ సంగీత శాస్త్రం నేర్చుకున్నారు. అలాగే హిందూస్థానీ, కర్ణాటక గజల్స్ లో శిక్షణ పొందారు. ఆ తర్వాత నేపథ్య గాయనీగా 2002లో సినీ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేశారు. తెలుగు, తమిళం, హిందీ వంటి తదితర భాషల్లో అనేక సాంగ్స్ పాడి ఆకట్టుకున్నారు. అందులో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. 2002లో అమృత అనే సినిమాలో ఏ దేవి వరము అనే పాటతో ఆమె సినీ కెరీర్ ప్రారంభించారు.

2007లో..

2007లో..

2007లో వచ్చిన సూపర్ స్టార్ రజనీ కాంత్ శివాజీ సినిమాలో సుహానా అనే పాటను హిందీ, తెలుగు, తమిళంలో పాడి ఆకట్టుకున్నారు. గురు, పూ, ఢిల్లీ 6 వంటి చిత్రాల్లో తన గాత్రంతో అలరించిన చిన్మయి మరోసారి రజనీ సినిమా రోబోలో కిలిమంజారో పాటతో మెస్మరైజ్ చేశారు. ఏ మాయ చేశావే సినిమాలో మనసా, పిల్ల జమిందార్ లో ఊపిరి ఆడదు నాకు, స్నేహితుడాలో అస్కు లస్కా, షారుక్ ఖాన్, దీపిక పదుకొణె నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ లో తితిలీ అనే పాటలతో సూపర్ ఫేమ్ దక్కించుకున్నారు.

మహిళలకు సంబంధించి..

మహిళలకు సంబంధించి..

ఇక ఏ మాయ చేశావే సినిమాలో ముద్దుగుమ్మ సమంతకు డబ్బింగ్ చెప్పి తనదైన ముద్ర వేసుకున్నారు. అనేక చిత్రాల్లో హీరోయిన్స్ కు గాత్రం అందించి పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆమె ఎక్కువగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ముఖ్యంగా మహిళలకు, సామాజిక అంశాలకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ ఆమె అభిప్రాయాలు పంచుకుంటారు. తాజాగా ఓ మీమ్ వీడియోపై ఆమె రియాక్ట్ అయ్యారు.

రక్తం వస్తేనే వర్జిన్..

రక్తం వస్తేనే వర్జిన్..

ఫస్ట్ నైట్ పై అబ్బాయిలు ఇలా ఊహిస్తారు.. కానీ రియాల్టీలో అలా ఉండదని ఇటీవల ఒక మీమ్ వీడియో వైరల్ అయింది. దానిపై స్పందిస్తూ వీడియో షేర్ చేశారు సింగర్ చిన్మయి. తొలి కలయికపై ఉండే అపోహలు, అమ్మాయిలను.. అబ్బాయిలు ట్రీట్ చేసే విధానంపై క్లాస్ పీకారు. "ఫస్ట్ ఇంటిమేట్ లో అమ్మాయిలకు నొప్పి ఉంటుందని, రక్తం వస్తేనే వర్జిన్ అని, టైట్ గా ఉంటేనే వర్జిన్ అని అంటూ ఉంటారు. కానీ అవన్నీ అపోహలు మాత్రమే" అని చిన్మయి తెలిపారు.

పోర్న్ చూసి..

పోర్న్ చూసి..

"ఫస్ట్ టైమ్ చేసినప్పుడు రక్తం రావాలి, హైమెన్ బ్రేక్ అవ్వాలి. లేకపోతే వర్జిన్ కాదు. టైట్ గా లేకుండా ఆమె వర్జిన్ కాదు. ఆమెకు ఇదివరకే లైంగిక అనుభం ఉంది. నిజానికి ఇంటర్ కోర్స్ చేసెటప్పుడు నొప్పి పెడుతుంటే ఆమె అందుకు సిద్ధంగా లేదని అర్థం. ఇలా మీమ్స్ వీడియోలతో నొప్పితో ఉన్న ఇంటర్ కోర్సును సాధారణ విషయంగా చేయడం సరైంది కాదు. ఇదంతా కొంతమంది అబ్బాయిలు పోర్న్ నుంచి చూసి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు" అని చిన్మయి అన్నారు.

పెళ్లి చేసుకోవాలని ఉంటే..

"నిజంగా పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఉన్న అబ్బాయిలు ఇంటర్ కోర్స్ గురించి ఏదైన దగ్గర్లో ఉన్న సెX ఎడ్యుకేషన్ క్లాసెస్ వినండి. అంతేకానీ పోర్న్ నుంచి నేర్చుకోకండి. అది అంతా మంచి విషయం కాదు. ఇంటిమేట్ సమయంలో నిజంగా భరించలేని నొప్పి ఉంటే కచ్చితంగా అది వైద్యపరంగా పెద్ద సమస్య. దానికి వెంటనే చికిత్స తీసుకోవాలి. అందుకు డాక్టర్స్ ను, గైనకాలజిస్టులను కలవండి. ఇలాంటి మీమ్స్, ట్రోలింగ్స్ నిజం కాదు. పట్టించుకోకండి"ఫ అని చిన్మయి శ్రీపాద చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X