సింగర్ చిన్మయికి లైంగిక వేధింపులు... చాలా నీచంగా ప్రవర్తించారంటూ ఆవేదన!
Recommended Video

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కూడా #మీటూ ఉద్యమంలో జాయిన్ అయ్యారు. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తనపై నానా పాటేకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపించిన అనంతరం మరోసారి దేశవ్యాప్తంగా #మీటూ కాంపెయిన్ ఉధృతం అయింది. తనకు జరిగిన చేదు అనుభవంపై చిన్మయి శ్రీపాద స్పందిస్తూ 'అపుడు నాకు 8 లేదా 9 సంవత్సరాలు ఉంటాయి. ఆ సమయంలోనే తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు చిన్మయి తెలిపారు.

ఆ స్టూడియోలో ఉండగా...
అపుడు నా వయసు 8 లేదా 9 సంవత్సరాలు. మా అమ్మ తన డాక్యుమెంటరీకి సంబంధించి రికార్డింగ్ సెషన్ సూపర్ వైజ్ చేస్తూ బిజీగా ఉంటే నేను పక్కన రూములో పడుకుని ఉన్నాను. ఓ వ్యక్తి నా ప్రైవేట్ పార్ట్ టచ్ చేసి రాక్షసానందం పొందాడు. వెంటనే నేను ఉలిక్కిపడి లేచాను. మా అమ్మకు ఆ అంకుల్ చెడ్డవాడు అని చెప్పాను. సంతోమె కమ్యూనికేషన్స్ అనే స్టూడియోలో ఈ సంఘటన జరిగింది అని చిన్మయి గుర్తు చేసుకున్నారు.

అన్నీ గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం
మహిళలు ప్రతి రోజూ, ప్రతి చోటా ఏదో ఒకరకంగా లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ప్రతి రోజూ జరిగిన సంఘటనలు గుర్తుంచుకోవడం చాలా కష్టం. చెడు ఉద్దేశ్యం లేని హగ్ ఒకే... కానీ వారిలో ఎలాంటి ఉద్దేశ్యం ఉందో మనం పసిగట్టడం చాలా కష్టం... అని చిన్మయి వ్యాఖ్యానించారు.

టీనేజ్ సమయంలో అక్కడ చేయి పెట్టి...
నేను టీనేజ్‌లో ఉన్నపుడు కొందరు మగాళ్లు నా షర్టు జేబులో చేయి పెట్టి అందులో ఏముందని వెతికేవారు. వారు అలా చేస్తుంది తప్పుడు ఉద్దేశ్యంతో అని తర్వాత అర్థమంది. నా చెస్ట్‌ను టచ్ చేయడానికే వారు అలా చేసేవారు... అని చిన్మయి గుర్తు చేసుకున్నారు.

ఈవ్ టీజింగ్ వల్లే పడిపోయాను
నా ఫస్ట్ బైక్ యాక్సిడెంట్ కొందరు యువకులు ఈవ్ టీజింగ్ చేయడం వల్ల జరిగింది. నా చేతికి చాలా గాయాలయ్యాయి. ఇలాంటి సంఘటనలు ప్రతి అమ్మాయి ఎదుర్కొంటూ ఉంటుంది అని చిన్మయి వెల్లడించారు.

19 ఏళ్ల వయసులో ఓ పెద్ద మనిషి కూడా
19 ఏళ్ల వయసులో మరోసారి వేధింపులకు గురయ్యాను. ఒక ఓల్డ్ మ్యాన్ ఒక కారణంతో తన ఆఫీసుకు పిలిచాడు. ఆ సమయంలో మా అమ్మ కూడా నాతో ఉంది. నాతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పాడు. అయితే అతడిపై ఎలాంటి అనుమానం రాలేదు. ఎందుకంటే గతంలో అతడు ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించడం చూడలేదు. తర్వాత నా దగ్గరకు వచ్చి కౌంగిలించుకుని తన బుద్ది చూపించాడు.... అని చిన్మయి తెలిపారు.


Click it and Unblock the Notifications











