Samantha Chinmayi:సమంతతో విభేదాలపై సింగర్ చిన్మయి క్లారిటీ.. నా జర్నీ ముగిసిందనుకుంటా!
ఏ మాయ చేశావే సినిమాతో వెండి తెరకు పరిచయమైన సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తర్వాత అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే స్టార్ హీరోయిన్ అయిన సమంతకు ఇండస్ట్రీలో అతి తక్కువ మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఒకరు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కు చిన్మయి భార్య అనే విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో సమంత, చిన్మయి మధ్య విభేదాలు తలెత్తాయని వచ్చిన వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చింది సింగర్ చిన్మయి శ్రీపాద.

తొలి సినిమా నుంచి..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, పాపులర్ సింగర్ చిన్మయి శ్రీపాద ఇద్దరు ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. సామ్ తొలి చిత్రం ఏం మాయ చేశావే మూవీ నుంచి సమంతకు చిన్మయి డబ్బింగ్ చెబుతూ వస్తోంది. అప్పటి వరుక ప్లే బ్యాక్ సింగర్‌గా ఉన్న చిన్మయి శ్రీపాదకు సమంతకు డబ్బింగ్ చెప్పడంతో ఒక్కసారిగా పాపులారిటీ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిన్మయి గొంతు వల్ల సమంతకు, ఆమెకు డబ్బింగ్ చెప్పడంతో చిన్మయికి ఇద్దరికీ మంచి గుర్తింపు వచ్చింది.

డబ్బింగ్ వల్లే..
ఇక అప్పటి నుంచి సమంత ప్రతి సినిమాలో చిన్మయి శ్రీపాదనే డబ్బింగ్ చెబుతుండేది. దీంతో వీరిద్దరి మధ్య స్నేహ బంధం బలంగా ఏర్పడింది. సమంతకు డబ్బింగ్ చెప్పడం వల్లే ఈ పేరు వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చిన్మయి కూడా చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో ''సమంత చాలా మంచి వ్యక్తి. సమంత వల్లే నాకు తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి కెరీర్ వచ్చింది. ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆమెతో నా జర్నీ ముగిసిందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు తన పాత్రలకు సమంత తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది.

అలా ఇష్టముండదు..
ఇక సమంతకు నేను డబ్బింగ్ చెప్పే అవకాశం రాదేమో'' అని చెప్పుకొచ్చింది చిన్మయి శ్రీపాద. అలాగే వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలపై ప్రశ్నించగా.. ''అందులో ఎంతమాత్రం నిజం లేదు. మేమిద్దరం కలిసినప్పుడల్లా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టకపోయినంత మాత్రానా మేం విడిపోయినట్లు కాదు. నా వ్యక్తిగత జీవితాన్ని అందరితో షేర్ చేసుకోవడం నాకు ఎంతమాత్రం ఇష్టముండదు. తరచుగా మేమిద్దరం కలుసుకుంటూనే ఉంటాం, కలిసి డిన్నర్లకు, పార్టీలకు వెళ్తుంటాం అని చెప్పుకోవడం వల్ల ఎవరికీ లాభం. అందుకే మేం కలిసిన విషయాలు ఎవరికీ చెప్పం. మేమిద్దరం కలవాలనుకుంటే ఇంట్లోనే కలుసుకుంటాం. నా భర్త రాహుల్, సమంత కూడా మంచి స్నేహితులు'' అని వివరణ ఇచ్చింది చిన్మయి.


Click it and Unblock the Notifications











