twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగాళ్ళు ఆ ఫోటోలు పంపారు.. రిపోర్ట్ చేస్తే నా అకౌంటే లేపేశారు.. మళ్ళీ వార్తల్లోకి చిన్మయి!

    |

    సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి తెలుగు ప్రేక్షకులు ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన పాటల కంటే ఎక్కువగా తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఫేమస్ అయిన ఆమె ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చింది. అలా వార్తల్లోకి వచ్చిన రెండు రోజులు కూడా గడవక ముందే ఆమె మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి పురుషుల గురించి మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేసింది. సింగర్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారి తనదైన శైలిలో పేరు తెచ్చుకుంది చిన్మయి శ్రీపాద. తర్వాతి రోజుల్లో హీరో రాహుల్ రవీంద్రన్ ను ప్రేమించి వివాహమాడిన ఆమె సమంతకు డబ్బింగ్ చెప్పడం వల్ల మంచి క్రేజ్ దక్కించుకుంది.

    అయితే ఆమె తన పాటలు, మాటలు కంటే ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు, ఆడవారిని సపోర్ట్ చేస్తూ మగవారిని దూషించే వ్యాఖ్యల వల్ల ఎక్కువ హైలైట్ అయింది. ఆమె ఇటీవలే ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి ఆసక్తికరంగా అందరికీ షాక్ ఇచ్చింది. నేను గర్భవతిని అనే విషయం తెలియక పోవడం వల్ల ఇప్పుడు నేను సరోగసీ ద్వారా పిల్లలను కన్నాను ఏమో అనే అనుమానాలు కలగవచ్చు కానీ మా ప్రైవేట్ విషయాలను బయట పెట్టడం ఇష్టం లేక నేను ఇలాంటి విషయాలను బయటకు రానివ్వలేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించారు.

     Singer Chinmayi Sripadas Instagram account suspended

    కాగా ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ఇంస్టాగ్రామ్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. దానికి కారణం నిబంధలకు విరుద్ధంగా ఆమె పోస్టులు ఉన్నాయట. నిజానికి ఆమె పోస్టు చేయడం లేదు కానీ ఆమెకు ఇంస్టాగ్రామ్ లో కొంతమంది పురుషులు అసభ్యకర ఫోటోలు కొందరు డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నారని పేర్కొంది. ఇదే విషయాన్ని ఫిర్యాదు చేసినందుకు నా అకౌంట్ ఇంస్టాగ్రామ్ వాళ్ళు సస్పెండ్ చేశారని చిన్మయి పేర్కొంది. ఇక తన బ్యాక్ అప్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఇదే అంటూ ఆమె ట్విట్టర్లో మరో అకౌంట్ వివరాలు ఇస్తూ పోస్ట్ పెట్టారు. మగవాళ్ళు తమ పురుషాంగాల ఫోటోలు పంపుతున్నారని చిన్మయి శ్రీపాద ఆ ట్వీట్ లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

    English summary
    Singer Chinmayi Sripada's Instagram account suspended after she blocked vulgar direct messages of men.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X