చిన్మయి ఇటు చూడు.. ఇతడిని కూడా తగులుకుంటావా.?: సింగర్‌కు ఊహించని ప్రశ్న

అక్కినేని నాగార్జున - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం 'మన్మథుడు 2'. మనం ఎంటర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్‌ (జెమిని కిరణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్లకు విశేష స్పందన వచ్చింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వచ్చిన ఈ సినిమా సెన్సార్ రిపోర్టుపై విమర్శలు వస్తున్నాయి. ఇందులోకి చిన్మయిని కూడా లాగుతున్నారు.

పాజిటివ్ ట్వీట్లు

పాజిటివ్ ట్వీట్లు

ఇప్పటికే ఓవర్సీస్‌లో సినిమా ప్రీమియర్ షోలు పడిపోయాయి. అక్కడ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో నాగార్జున చాలా హ్యాండ్సమ్‌గా కనిపించాడని అంటున్నారు. ఫస్టాప్ కామెడీగా బాగుందని, సెకెండాఫ్ మాత్రం సాగదీతగా ఉందని పలువురు ట్వీట్ చేస్తున్నారు. అయితే, అక్కినేని అభిమానులు మాత్రం సినిమా హిట్ అని చెబుతున్నారు.

సెన్సార్ రిపోర్డు

సెన్సార్ రిపోర్డు

ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ యూనిట్ ‘మన్మథుడు 2'కు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ 2.35 గంటలు ఉంది. వాస్తవానికి ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లలో ఉన్న సీన్లను బట్టి దీనికి A సర్టిఫికెట్ జారీ చేస్తారని అనుకున్నారు. కానీ, దానికి భిన్నంగా U/A సర్టిఫికెట్ రావడంతో చిత్ర యూనిట్‌తో పాటు నాగ్ అభిమానులు ఖుషీ అయ్యారు.

తొమ్మిది మార్పులు

బయటకు వచ్చిన రిపోర్టు ప్రకారం.. రెండు సీన్లను బ్లర్ చేశారు. అలాగే, ఆరు చోట్ల డైలాగులను మ్యూట్ చేశారు. వీటితో పాటు మద్యం సేవించే సందర్భంలో హెచ్చరికలు వేశారు. బ్లర్ చేసిన రెండు సీన్లలో ఒకటి.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. సహ నటి ఝాన్సీకి లిప్ లాక్ ఇచ్చిన సీన్ అని రాసి ఉంది. ఇది బయటకొచ్చినప్పటి నుంచి అందరూ షాక్ అవుతున్నారు.

చిన్మయికి ట్వీట్

చిన్మయికి ట్వీట్

సెన్సార్ రిపోర్టును ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చిన్మయికి ట్వీట్ చేశాడు. ‘‘చిన్మయి దయచేసి ఇటు చూడు. ‘మన్మథుడు 2' సినిమాను మీ భర్త డైరెక్ట్ చేశాడు. ‘మార్నింగ్ సౌండ్స్ ఇన్ ద బిగినింగ్', ‘ఫ*** స** ' అంట. ఏంది ఇది ఒకసారి చూస్కో. మరి అందరినీ తగులుకున్నట్లే మీ ఆయన్ని కూడా తగులుకుంటావా మరి. మీరు అసలే స్వయం ప్రకటిత ఫెమినిస్ట్ కదా'' అని అందులో పేర్కొన్నాడు.

మన్మథుడు - చిన్మయి

మన్మథుడు - చిన్మయి

ఒకవైపు రాహుల్ సినిమాలో బోల్డు కంటెంట్ పెడుతుంటే, మరోవైపు చిన్మయి మాత్రం దానికి వ్యతిరేకంగా మాట్లాడడం చర్చనీయాంశం అయింది. దీంతో చాలా మంది ‘‘మీరు చాలా నీతులు చెబుతున్నారు. మరి మీ భర్తగారు తన సినిమాలో చూపిస్తున్నది ఏమిటి? ‘మన్మధుడు 2' టీజర్లో రకుల్ స్మోకింగ్ సీన్ చూపడం ద్వారా అమ్మాయిలు పొగతాగాలని ఎంకరేజ్ చేస్తున్నారా? హీరోయిన్ బటన్ విప్పడం, ప్లర్టింగ్ చేయడం చూపిండం ద్వారా ఈ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు?'' అంటూ చిన్మయి మీద గతంలోనూ విరుచుకుపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X