»   » సింగర్ గీతా మాధురి నటిస్తున్న సినిమా ఇదే... (ఫస్ట్‌లుక్ హాట్ ఫోటోస్)

సింగర్ గీతా మాధురి నటిస్తున్న సినిమా ఇదే... (ఫస్ట్‌లుక్ హాట్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ క్రేజీ సింగ‌ర్‌ గీతామాధురి త్వ‌ర‌లో వెండితెర ఆరంగేట్రం చేస్తోందంటూ వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ యంగ్ అండ్ డైన‌మిక్ సింగ‌ర్ న‌టించే ఆ సినిమా ఏది? అన్న ఆస‌క్తి క‌న‌బ‌రిచారంతా. ఏదైతేనేం గీతామాధురి న‌టించిన సినిమా డీటెయిల్స్ వ‌చ్చేశాయి. డైన‌మిక్ సింగ‌ర్ స్టైల్‌ని ఎలివేట్ చేస్తూ కొన్ని స్టిల్స్ రిలీజ్ అయ్యాయి.

గీతామాధురి ఎంట్రీ ఇస్తున్న ఆ ఇంట్రెస్టింగ్‌ సినిమా మెట్రో. ఇటీవ‌లే స్టార్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ ఫెంటాస్టిక్ నేరేషన్‌తో తెర‌కెక్కిన చిత్రంగా ఈ సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ర‌క్తిక‌ట్టించే ఈ చిత్రం తెలుగులోనూ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది.

నటనతో పాటు పాట కూడా

నటనతో పాటు పాట కూడా

`మెట్రో`లో ఓ సాంగ్‌లో గీతామాధురి త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్నారు. ఎంతో శ్రావ్యంగా సాగే ఈ మెలోడీ పాట‌ను తాను స్వ‌యంగా ఆల‌పించడ‌మే గాకుండా త‌న‌దైన శైలిలో అభిన‌యించారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌జ‌నీ తాళ్లూరి మాట్లాడుతూ

ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌జ‌నీ తాళ్లూరి మాట్లాడుతూ

`` అతి త్వ‌ర‌లోనే `మెట్రో` తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. గీతామాధురి ఆల‌పించిన ఆ మెలోడీ సాంగ్ సినిమాకి పెద్ద అస్సెట్‌. ఈ ట్యాలెంటెడ్ సింగ‌ర్ స్వ‌యంగా పాడ‌ట‌మే గాకుండా అభిన‌యించారు. ఈ సినిమాలో అన్ని పాట‌లు సంద‌ర్భానుసారం వ‌స్తూ వేటిక‌వే ప్ర‌త్యేకంగా అల‌రిస్తాయి. ఈ రోజు గీతా మాధురికి సంబంధించిన స్టిల్స్ ను రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.

స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ

స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ

వ‌ర్ధ‌మాన గాయ‌ని గీతామాధురి ఆల‌పించి నటించిన‌ ఈ గీతం సినిమాలో వెరీ స్పెష‌ల్‌. మేకింగ్ ప‌రంగా విజువ‌లైజేష‌న్ ప‌రంగా వండ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. క్రియేటివ్ మేకింగ్ క‌నిపిస్తుంది. ఈ సీజ‌న్‌లో పెద్ద హిట్ట‌య్యే చిత్ర‌మిది. ఇటీవ‌లే డ‌బ్బింగ్ ప‌నులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫైన‌ల్ మిక్సింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం`` అని తెలిపారు.

బాలయ్య జోరుకు బెంబేలెత్తిపోయిన గీతా మాధురి

బాలయ్య జోరుకు బెంబేలెత్తిపోయిన గీతా మాధురి

ఎనర్జీ అంటేనే బాలయ్య... బాలయ్య అంటేనే ఎనర్జీ. సినిమాలో ఆయన సాంగేసుకున్నా, ఫైటింగులు చేసినా, డైలాగ్ చెప్పినా, రొమాన్స్ చేసినా బాలయ్యకు బాలయ్యే సాటి అంటుంటారు ఆయన అభిమానులు. బాలయ్య జోరుకు బెంబేలెత్తిపోయిన గీతా మాధురి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

లవ్: సింగర్ గీతామాధురికి కారు గిఫ్టుగా...(ఫోటోస్)

లవ్: సింగర్ గీతామాధురికి కారు గిఫ్టుగా...(ఫోటోస్)

తెలుగు సింగర్ గీతా మాధురి ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు నటుడు నందుతో ఆమె వివాహం జరిగింది. వీరి దాంపత్యం ఎంతో... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ప్రియుడితో సింగర్ గీతా మాధురి వివాహం

ప్రియుడితో సింగర్ గీతా మాధురి వివాహం

ప్రియుడితో సింగర్ గీతా మాధురి వివాహం (ఫోటోలు కోసం క్లిక్ చేయండి)

English summary
We recently reported that Popular Singer Geetha Madhuri is making her debut in a film. The details about the film were kept under wrap. Now, the exciting details about her launch are out. Geetha Madhuri is making her debut with upcoming film 'Metro'. We read so many article about chain-snatching every day, but this is the first film to go through this concept. It is one of the finest film in recent time and it will surely entertain every Telugu audience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu