twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్జీవికి ఎదురెళ్లడమా?: గీతా మాధురి సాహసమే.., సంచలన కామెంట్స్

    |

    Recommended Video

    ఆర్జీవి పై గీతా మాధురి కౌంటర్ !

    వర్మ వ్యాఖ్యలకు ఎదురెళ్లడమంటే.. అందులో పడి కొట్టుకుపోవడమే. తన వాదనతో ఎదుటోళ్లను ముప్పు తిప్పలు పెట్టి కన్ఫ్యూజన్‌లో ముంచేయడంలో ఆయన ధిట్ట. అందుకే వర్మతో ఆర్గ్యుమెంట్ అంటే చాలామంది తటాపటాయిస్తారు. దానికి బదులు సైలెంట్‌గా ఉండటమే బెటర్ అనుకుంటారు. కానీ సింగర్ మాధురి మాత్రం ఆయనకు కౌంటర్ ఇచ్చేంత సాహసం చేశారు..

     అసలు వర్మ ఏమన్నారు:

    అసలు వర్మ ఏమన్నారు:

    'కేవలం హ్యాపీ న్యూ ఇయర్‌ అని విష్‌ చేస్తే సంతోషంగా ఉంటారనుకునే మూర్ఖులకు 'అన్‌హ్యాపీ న్యూఇయర్‌' చెప్పాలనుకుంటున్నాను. నిజంగా ఎదుటివారు సంతోషంగా ఉండాలని కోరుకునేవాళ్లు.. వారి ఆస్తులు, విలువైన వస్తువులు వేరొకరికి ఇచ్చేయాలి. కానీ..

     విష్ చేయడం ఫ్రీ కాబట్టి..:

    విష్ చేయడం ఫ్రీ కాబట్టి..:

    'కానీ ఎవరూ అలా చేయరు. విషెస్ చెప్పడంలో ఖర్చేమి లేదు కాబట్టి వాటితో సరిపెట్టుకుంటారు. ఏదేమైనా హ్యపీ న్యూఇయర్‌ చెప్పడం ఇష్టంలేని వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని వర్మ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.

     గీతా మాధురి స్పందన..:

    గీతా మాధురి స్పందన..:

    'నా వరకైతే.. ప్రతీ రోజూ ప్రత్యేకమైనదే. అందరూ నవ్వుతూ బ్రతకాలని చెబుతుంటారు ఇందులో ఏ ఖర్చూ లేదు. ఆ మాదిరిగానే కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలపడం కూడా ఎదుటివారిలో అనుకూలతను పెంచడమే.'

     'ఫ్రీ'గానే అయినా మంచిపని..:

    'ఫ్రీ'గానే అయినా మంచిపని..:

    'అంతేకాదు, ఇలా విషెస్ చెప్పడం ఉచితంగా అందరిలో అనుకూలతను పెంచడమే. ఒకవేళ దానికోసం ఏదైనా ఖర్చు చేస్తే తిరిగి దానినుండి మరేదైనా ఆశిస్తారు. ఇది కాసింత ప్రతికూలత పెంచే అవకాశం ఉంది'

    కౌంటర్ ఇచ్చిందా?..:

    కౌంటర్ ఇచ్చిందా?..:

    విషెస్ చెప్పడం ఫ్రీ కాబట్టి అందరూ న్యూ ఇయర్ కు తెగ విష్ చేస్తారని రాంగోపాల్ వర్మ అంటే.. ఫ్రీ గానే ఎదుటోళ్లతో స్నేహాపూర్వక తత్వాన్ని, అనుకూలతను పెంచవచ్చని, అందుకు విషెస్ బాగానే తోడ్పడుతుందనేది గీతా మాధురి వాదన. పైగా.. ఫ్రీ విషెస్ కాకుండా, ఖర్చు చేసి విష్ చేస్తే ఇద్దరి మధ్య ప్రతికూలతలు పెరుగుతాయంటున్నారామె.

    English summary
    Singer Geetha Madhuri Given Strong Counter To Director Ram Gopal Varma's latest tweet over new year celebrations
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X