ప్రియుడితో సింగర్ గీతా మాధురి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
హైదరాబాద్ : సింగర్ గీతా మాధురి నటుడు నందును ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా గీతామాధురి-నందు వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి గీతా మాధురి తోటి సింగర్లు హాజరయ్యారు . నటుడిగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న నందు శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన 'ఫోటో' సినిమాతో తెరంగేట్రం చేసారు.
ఆమధ్య వచ్చిన '100% లవ్' సినిమాతో నందు గుర్తింపు తెచ్చుకున్నాడు. 100% అందులో తమన్నాను ప్రేమించే యువకుడిగా నందు నటించాడు. కాగా... ఇటీవలే 'అదితి' అనే లఘు చిత్రంలో నందు, గీతామాధురి కలిసి నటించారు. ఇప్పటి వరకు సింగర్ గీతా మాధురిని కేవలం తెర వెనక సింగర్ గా మాత్రమే పరిమితం అయింది. ఇప్పుడు ఆమె తన కాబోయే భర్త నందుతో షార్ట్ ఫిలింస్‌లో నటించడం చూస్తూ ఇద్దరూ కలిసి కట్టుగా నటనా రంగంలో ఎదగాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
వీరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. ఇరు వర్గాల పెద్దలు అంగీకరించడంతో పెళ్లికి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది వీరి వివాహం జరిగే అవకాశం ఉంది. స్లైడ్ షోలో....నిశ్చితార్థం ఫోటో, మరిన్ని వివరాలు

గీతా మధురి-నందు
గీతామాధురి-నందు వివాహ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గీతా మాధురి తోటి సింగర్లు హాజరయ్యారు.

పెళ్లి ఎప్పుడు?
గీతా మాధురి కుటుంబ సభ్యులతో పాటు, నందు తల్లి దండ్రులు కూడా వీరి ప్రేమ వివాహానికి ఒప్పుకున్నారు. 2014లో వీరి పెళ్లి జరుగనుంది

పర్ ఫెక్ట్ జోడీ
పర్సనాలిటీ పరంగా సింగర్ గీతా మాధురికి...నందు తగిన ఈడు జోడు అని చెప్పుకోవచ్చు. ఈ ఫోటోలో కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తే మీరు అదే విషయం ఒప్పుకుంటారు.

సినిమా రంగం పరిచయం
ఇద్దరూ సినీరంగానికి చెందిన వారే కావడం, ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది.

గీతా మాధురి
పలు సింగింగ్ రియాల్టీ షోల ద్వారా గీతా మాధురి ఇప్పటికే బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం అయింది. ఈ నేపథ్యంలో ఆమె నటన వైపు వస్తే ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.


Click it and Unblock the Notifications











